సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం


Sat,September 8, 2018 12:41 AM

నేరడిగొండ : తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును తిరిగి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై మండలంలోని టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకొంటున్నారు. మండలంలోని కుమారి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కుప్టి గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్వీట్లు పంచారు. మళ్లీ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాథోడ్ బాపురావును గెలిపించి అసెంబ్లీకి పంపుతామని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కుంట కిరణ్‌కుమార్‌రెడ్డి, నాయకులు కొయ్యడి గంగయ్య, కృష్ణ, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

190
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...