ఆగని కలప అక్రమ రవాణా

Sat,September 8, 2018 12:41 AM

నేరడిగొండ : ప్రభుత్వం అక్రప కలప రవాణాను నిరోధించడానికి కఠిన చర్యలు చేపడుతున్నా స్మగ్లర్లు మాత్రం రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. జిల్లాలోని విలువైన టేకు కలపను ఇతర ప్రాంతాలకు తరలించి జిల్లాలోని కలప సంపదను నాశనం చేస్తున్నారు. స్మగ్లర్లు కూడా కొంత మంది పెద్దల అండదండలతో ఈ దందా దర్జాగా కొనసాగిస్తున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం హరితహారం పేరుతో చెట్లను నాటుతుంటే స్మగ్లర్లు విలువైన చెట్లను నరికి వారి స్వార్థం కోసం అడవులను నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. నాలుగులక్షల విలువైన కలప జాతీయ రహదారి మీదుగా అక్రమంగ తరలిస్తుందంటే స్మగ్లింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో మనకు అర్థమవుతోందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో అటవీ శాఖాధికారులు గురువారం రాత్రి భారీగా టేకు కలప పట్టుకున్నట్లు నేరడిగొండ ఇన్‌చార్జి రేంజ్ అధికారి మనోహర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ముందస్తు సమాచారం మేరకు రేంజ్ అధికారితో పాటు డిప్యూటీ రేంజ్ అధికారి రవికుమార్, ఎఫ్‌ఎస్‌వో సహజుల్‌హక్, ఎఫ్‌బీవో భీంజీనాయక్ తమ సిబ్బందితో జాతీయ రహదారిపై, చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించారు.

ఈస్‌పూర్ చెక్‌పోస్టు వద్దకు మాటు వేయగా అక్రమంగా కలప తరలిస్తున్న వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అందులో 11 కలప దుంగలు ఉండగా స్మగ్లర్లను ఇచ్చోడ మండలం దాబా కు చెందిన గణేశ్, శ్యాంసుందర్‌గా గుర్తించారు. వారిని లోతుగా విచారించగా అంతకు ముందు రెండు వాహనాలు వెళ్లినట్లు అధికారులకు చెప్పారు. దీంతో వెంటనే అధికారులు వెంబడించి నిర్మల్ జిల్లా సోన్‌గ్రామ సమీపంలో మిగతా వాహనాలను పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన స్మగ్లర్లు మిర్జామైముద్ బేగ్, సయ్యద్ అలిముల్లా, మహ్మద్‌అన్వర్, సుల్తాన్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ రూ.4 లక్షలు ఉంటుందని ఎఫ్‌ఆర్వో తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా అటవీశా ఖాధికారి సిబ్బందిని అభినందించారు. స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎఫ్‌బీవో గంగామణి, బేస్ క్యాంప్ సిబ్బంది అనిల్, సునిల్, ఉత్తం, అభిమాన్, సుభాష్, శ్రీకాంత్, సృజన్, దేవేందర్, డ్రైవర్ జాబిర్ పాల్గొన్నారు.

229
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles