సిట్టింగులకే ఛాన్స్

Thu,September 6, 2018 11:50 PM

-సమర్థతకు పట్టం కట్టిన గులాబీ దళపతి
-టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కేసీఆర్
-ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి జోగు రామన్న
-బోథ్ నుంచి రాథోడ్ బాపురావు..
-ఖానాపూర్ నుంచి రేఖానాయక్ పోటీ
ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : అసెంబ్లీని రద్దు చేస్తూ గులాబీ దళపతి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభ్యులుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన గెలుపు గుర్రాలకే మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తూ జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు. గురువారం శాసనసభ రద్దు అనంతరం 105 నియోజకవర్గాల్లోని అభ్యర్థులను ప్రకటించగా.. అందులో జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, రేఖానాయక్ పేర్లు ఉన్నాయి. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జాబితా ప్రకటన అనంతరం అభ్యర్థులకు పలువురు నాయకులు స్వీట్లు తినిపించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. తమ నియోజకవర్గాల్లో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రజల మన్ననలు పొంది గెలుపుకోసం కృషి చేయాలన్నారు.

టీ ఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నికల భేరీ మోగించారు. గురువారం అసెంబ్లీని రద్దు చేయడంతో పాటు ఎన్నికల్లో పోటీచేసి 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులో జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు పేర్లు సైతం ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొంది రాష్ట్ర అటవీ పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న జోగు రామన్నతో పాటు బోథ్ నియోజవర్గం రాథోడ్ బాపురావు పేర్లు ఉన్నాయి. 35 ఏళ్లుగా రాజకీయంలో ఉన్న మంత్రి జోగు రామన్న సర్పం చ్ నుంచి రాష్ట్ర మంత్రి వరకు వివిధ పదవుల్లో కొనసాగారు. 1985-86లో టీడీపీ జైనథ్ మండల ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1987-88లో జైనథ్ మండల టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు.1988 నుంచి 1995 వరకు దీపాయిగూడ సర్పంచ్‌గా పని చేశారు. 1988 నుంచి 1995 వరకు జైనథ్ మండలం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 1995 నుంచి 2001 వర కు జైనథ్ మండల అధ్యక్షునిగా పని చేశారు. 2001 నుంచి 2005 వరకు 2006 నుంచి 2009 వరకు జైనథ్ జడ్పీటీసీగా ఉన్నారు. 2001 జూలై 23నుంచి 2009 వరకు జిల్లా ప రిషత్‌లో తెలుగుదేశం పార్టీ విప్‌గా పని చేశా రు. 2004లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పో టీ చేశారు. 16-05-2009న తొలిసారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 23-11-2011లో ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరా రు. 31-3-2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు. 2014లో జరిగి న సాధారణ ఎన్నికల్లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2-06-2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రిగా పని చేస్తుండగా.. 16-12-2014నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు ని ర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 105 మంది తొలి జాబితాలో ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా పేరు ఖరారైంది.

ఉద్యమంలో చురుకైన పాత్ర
టీఆర్‌ఎస్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన రాథోడ్ బాపురావు 2014 ఎన్నిక ల్లో బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1987 నుంచి 2009 వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో హిందీ పండిట్‌గా పని చేశారు. 2009 నుంచి 2014 వరకు టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడిగా ఉండి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పా ల్గొన్నారు. 2014 మే జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున బోథ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 105 మంది తొలి జాబితాలో బోథ్ నియోజకవర్గం నుంచి మరోసారి పేరు ఖరారైంది. రెండోసారి టికెట్ దక్కించుకున్న ఇద్దరు నేతలు నాలుగేళ్లుగా ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అ మలు పర్చడంతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పథకాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను గుర్తించి వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు జోగు రామన్న, రాథోడ్ బాపురావు పేర్లను ప్రకటించడంపై ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు తమను మరోసారి గెలిపిస్తాయని ఇరువురు అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ సేవలను గుర్తించి మరోసారి పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేయ డంపై ఇరువురు నేతలు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా..
అజ్మీరా రేఖానాయక్ 2009లో రాజకీయ ప్రవేశం చేశారు. 2009లో ఆసిఫాబాద్ జడ్పీటీ సీగా గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. ఖానాపూ ర్ నుంచి ఎమ్మెల్యేగా 16వేల ఓట్ల మెజారిటీ తో సమీప టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించా రు. 2018లో మళ్లీ రెండోసారి టీఆర్‌ఎస్ తర ఫున జాబితాలో పేరు ఖరారైంది.

ఆదిలాబాద్ నియోజకవర్గం
అభ్యర్థి పేరు : జోగురామన్న
తండ్రిపేరు : ఆశన్న
పుట్టిన తేది : 04-07-1961
సొంతగ్రామం : దీపాయిగూడ, జైనథ్ మండలం
విద్యార్హత : బీఏ
-1984లో టీడీపీలో చేరిక..
-1985-86లో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
-1987-88లో మండల టీడీపీ పార్టీ అధ్యక్షునిగా పని చేశారు.
-1988నుంచి 1995 వరకు దీపాయిగూడ సర్పంచ్‌గా పని చేశారు.
-1988నుంచి 1995 వరకు జైనథ్ మండలం ఉపాధ్యక్షునిగా ఉన్నారు.
-1995 నుంచి 2001 వరకు జైనథ్ మండల అధ్యక్షునిగా పని చేశారు.
-2001 నుంచి 2005 వరకు 2006 నుంచి 2009 వరకు జైనథ్ జడ్పీటీసీగా ఉన్నారు.
-2001జూలై 23నుంచి 2009 వరకు జిల్లా పరిషత్‌లో తెలుగుదేశం పార్టీ విప్‌గా పని చేశారు.
-2004లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పని చేశారు.
-16-05-2009న తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
-23-11-2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.
-31-03-2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
-2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు.
-02-06-2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రిగా పని చేస్తుండగా.. 16-12-2014నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
-ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 105 మంది తొలి జాబితాలో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మరోసారి పేరు ఖరారైంది.

బోథ్ నియోజకవర్గం
అభ్యర్థి పేరు : రాథోడ్ బాపురావు
తండ్రి పేరు : రాథోడ్ నారాయణ
పుట్టిన తేది : 12-03-1962
వివాహం : 25-02-1993
విద్యార్హత : ఎంఏ, బీఏడ్
భార్యపేరు : ఆర్.వందన
నివాసస్థలం : టీచర్స్ కాలనీ, ఆదిలాబాద్
-1987నుంచి 2009వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో హింది పండిత్‌గా పని చేశారు.
-2009 నుంచి 2014వరకు టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకునిగా ఉన్నారు.
-మే 2014 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున బోథ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
-ముఖ్యమంత్రి కేసీఆర్‌ప్రకటించిన 105 మంది తొలి జాబితాలో బోథ్ నియోజకవర్గం నుంచి మరోసారి టికెట్ దక్కించుకున్నారు.

ఖానాపూర్ నియోజకవర్గం
అభ్యర్థి పూర్తి పేరు : అజ్మీరా రేఖానాయక్
భర్త పేరు : అజ్మీరా శ్యాం నాయక్
పుట్టిన తేది : 19.12.1974
వివాహం : 10.08.1988
విద్యార్హత : ఎంఏ ఎల్ ఎల్ బీ
నివాస స్థలం : రాజీవ్‌నగర్, ఖానాపూర్
కూతరు, కొడుకు : పూజ, అక్షిత్
రాజకీయ ప్రవేశం : -2009లో ఆసిఫాబాద్ జడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసి గెలుపొందారు.
-2013లో ఏప్రిల్ 22న టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో తలపడ్డారు.
-2014 సంవత్సరంలో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 16 వేల ఓట్ల మెజారిటీతో సమీప టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు.
-2018లో మళ్లీ రెండో సారి అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి జాబితాలో పేరు దక్కించుకున్నారు.

278
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles