అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష

Thu,September 6, 2018 11:47 PM

-మంత్రి రామన్నకు అసెంబ్లీ టికెట్ ఖరారుపై హర్షం
-పట్టణంలో భారీ ర్యాలీ, పటాకులు కాల్చి కార్యకర్తల సంబురాలు
తెలంగాణచౌక్ : రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నను మరోసారి గెలిపిస్తాయని జోగు ఫౌం డేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. గురువారం అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేయడం, మంత్రి రామన్నను ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంపై టీఆర్‌ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఉదయం నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్కంఠగా మంత్రి రామన్న నివాసంలో టీవీలకు అతుక్కుపోయి రాజకీయ పరిణామాలను ఆసక్తిగా గమనించారు. మంత్రి రామన్నకు టికెట్ ఖరారు కావడంతో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రి జోగు రామన్న అభిమానులు పెద్ద ఎత్తున మంత్రి నివాసానికి చేరుకున్నారు. మంత్రి రామన్న తనయులు జోగు ప్రేమేందర్, జోగు మహేందర్‌కు మిఠాయిలు తినిపించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన చౌక్‌ల మీదుగా బైక్ ర్యాలీ చేపట్టారు. టీఆర్‌ఎస్ జెం డాలను చేతపట్టుకొని నినాదాలు చేస్తూ పట్టణమంతా కలియతిరిగారు.

టీఆర్‌ఎస్ శ్రేణుల ర్యాలీతో పట్టణంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఈ సందర్భంగా జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలందరూ ఆదరిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలందరూ సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. రాబోయే ముందస్తు ఎన్నికల్లో మంత్రి జోగు రామన్న భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఐసీడీఎస్ కా ర్యనిర్వాహకురాలు కస్తాల ప్రేమల ఆపద్ధర్మ మంత్రి జోగు రా మన్న సతీమణికి స్వీటు తిని పించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బం డారి సతీశ్, కౌన్సిలర్లు గండ్ర త్ రాజు, ఆవుల వెంకన్న, జహీర్ రంజానీ, ధారవేణి సత్యనారాయణ, వెనుగంటి ప్రకాశ్, ఖలీల్ అహ్మద్, విజ య్, జడ్పీటీసీ ఇజ్జగిరి అశో క్, మావల మాజీ సర్పంచ్ ఉష్కం రఘుపతి, జైనథ్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పెందూర్ దేవన్న, మావల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్, టీఆర్‌ఎస్వీ పట్టణ అధ్యక్షుడు తమ్మల చందు, టీఆర్‌ఎస్వీ జిల్లా కన్వీనర్ శివకుమార్, పార్టీ నాయకులు మేకల అశోక్, కొడిమెల వేణు, లింగన్న, అడప తిరుపతి, సిరాజ్‌ఖాద్రి, ఖయ్యుం, గంగారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

262
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles