గర్భిణులపై శ్రద్ధ వహించాలి


Thu,January 24, 2019 01:06 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : గ్రామాల్లోని గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్యాధికారి రాజీవ్ అన్నారు. ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు ఉట్నూర్ ఐటీడీఏ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాత శిశు మరణాలు లేకుండా చూసేందుకు వైద్య సిబ్బంది విస్తృతంగా పర్యటించి వైద్యం అందించాలన్నారు. గర్భవతి అని తెలియగానే ఏఎన్ వారి వివరాలను ఆన్ నమోదు చేయడంతో పాటు వైద్యం క్రమం తప్పకుండా అందించాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయిస్తూ కేసీఆర్ కిట్ అందించేందుకు అధికారులు ప్రత్యేక తీసుకోవాలన్నారు. క్షయవ్యాధి గుర్తించడంలో అలసత్వం వహిస్తున్న వైద్యసిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఆశ నెలకు పది మంది వ్యాధిగ్రస్తుల తెమడలను పరీక్షించి వివరాలు ఆన్ నమోదుచేయాలన్నారు. జిల్లా అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి వైద్యసిబ్బంది అందిస్తున్న వివరాలను సేకరించాలన్నారు. పీహెచ్ శుభ్రతను పాటించాలని, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్ వైద్యసేవలు అందిస్తున్న వివరాలను వాట్సాప్ సమాచారం అందించాలని సూచించారు. ప్రసవానికి వచ్చే వారితో ఆశలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో కంటివెలుగు శిబిరాలు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. టీబీ కేసులు పది కన్న ఎక్కువ ఉన్న గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జనన, మరణ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి తొడసం చందు, డిప్యూటీ డీఎంహెచ్ వసంత్ జిల్లా నోడల్ అధికారి సాధన, వైద్యులు, సూపర్ హెల్త్ ఎడ్యూకేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

131
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles