ఐక్యంగా ఉంటూ అభివృద్ధి బాటలో నడవాలి


Thu,January 24, 2019 01:05 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: ఐక్యతతో అభివృద్ధి బాటలో నడవాలని ఆ దిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. బేల మండలంలోని పలు గ్రామాలకు చెందిన నూతన సర్పంచులు ఎమ్మెల్యేను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించా రు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం అర్హులకు అందేలా చూడాలన్నారు. ప్రతి సంక్షేమ ఫలం నిరుపేదలకు చేరి వా రు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సీఎం కేసీఆర్ కలను నెరవేర్చిన వారమవుతామన్నారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో టీఆర్ బలపర్చిన అభ్యర్థులు భారీ మె జార్టీతో గెలిపించారని, పార్టీని ఆదరించి ఓట్లు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపా రు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీతో పాటు ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చే శారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలే పార్టీ కి పట్టుకొమ్మలని, త్వరలో జరిగే రెండో, మూడో విడత ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెంది దేశం లో అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్య క్తం చేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరె రాజన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

168
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles