గుంజాల గోండ్ లిపికి గుర్తింపు


Thu,January 24, 2019 01:05 AM

నార్నూర్ : గుంజాల గోండ్ లిపి ప్రపంచ స్థాయి లిపుల సరసనలో చేరిందని గోండ్ లిపి అధ్యయన వేదిక అధ్యక్షుడు, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్ అన్నారు. బుధవారం మండలంలోని గుంజాల గ్రామంలో గోండ్ అధ్యయన కేంద్రంలో సంగీత, వాయిద్యాలు, సంగీత ప్రదర్శనకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల సంగీతానికి, కళలకు సరైన గుర్తింపు లభించకపోవడంతో అవి కనుమరుగు అవుతున్నాయన్నారు. కళలను కాపాడుకోనేందుకు తెలంగాణ రచయితల వేదిక ఇతర సంస్థలతో కలిసి మార్చి 2, 3వ తేదీల్లో 40 రకాల ఆదివాసీ సంగీత వాయిద్యాలు, వాటి బృందాలతో హైదరాబాద్ ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రదర్శనగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. గుంజాల గోండ్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచ స్థాయి లిపుల్లో గుంజాల గోండ్ యూనైసీ కోడ్ అధికారికంగా ప్రకటించిందన్నారు. గోండ్ నిఘంటువు తయారు చేస్తున్నామని కొద్దిరోజుల్లోనే మూడో వాచకం విడుదల చేస్తామన్నారు. యువత విద్యారంగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరి 7న కెస్లాపూర్ దర్బార్ గోండ్ క్యాలెండర్ ఆవిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ నిర్వహించే 40 రకాల సంగీత, కళల, జానపద వాయిద్యాలకు ‘రెలా పూల రాగం’ పేరుతో ప్రదర్శించబోతున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కెరావ్, చోలెటి రాజారెడ్డి, రాజారామ్, రిసెర్చ్ సభ్యులు కుమ్ర అనిల్ మెస్రం దుర్గుపటేల్, మాజీ సర్పంచి కోట్నాక్ కృష్ణ, కోఆర్డినేటర్ వినాయక్, ఆదివాసీ పెద్దలు ఉన్నారు.

274
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles