ఉమ్మడి జిల్లాలో ‘ఏక’తారాగం


Thu,January 24, 2019 01:05 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో అభివృద్ధిని కాంక్షించి పల్లె వాసులు ఏకగ్రీవం వైపు మొగ్గు చూపారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో గతంలో 866 గ్రామ పంచాయతీలు ఉండ గా.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో వీటి సంఖ్య 1508కి చేరింది. తాజాగా వీటిలో ఆదిలాబాద్ జిల్లాలో రెండు గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు గడువు ఉండగా.. 1506 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా.. తొలి దశ ఎన్నికలు కూడా పూర్తయ్యా యి. మరోవైపు రెండో దశ ఎన్నికలు శుక్రవారం, మూడో దశ ఎన్నికలు ఈ నెల 30న నిర్వహిస్తున్నారు. పూర్వ ఆదిలాబా ద్ జిల్లాలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేశా రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 350 గ్రామ పం చాయతీలను ఏకగ్రీం చేసుకోవడం గమనార్హం. 2013 ఎన్నిక ల్లో కేవలం 78గ్రామ పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి.


ప్రస్తుతం పూర్వ జిల్లాలో 1506 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా.. 350 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేశారు. ఈ లెక్కన 25 శాతం వరకు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2013 ఎన్నికల్లో 866 గ్రామ పంచాయతీలకు కేవలం 78 గ్రామ పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం చేశారు. ఈ లెక్కన 2013 కంటే ప్రస్తుతం గ్రామ పంచాయతీల సంఖ్య రెట్టింపుకాగా.. ఏకగ్రీవాలు మాత్రం నాలుగు రెట్లకుపైగా చేయడం గమనార్హం. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో 35 గ్రామ పంచాయతీలు, నిర్మల్ జిల్లాలో 29 గ్రామ పంచాయతీలు, మంచిర్యాల జిల్లాలో 11 గ్రామ పంచాయతీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 3 గ్రామ పంచాయతీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 169 గ్రామ పంచాయతీలు, నిర్మల్ జిల్లాలో 91, మంచిర్యాల జిల్లాలో 31, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 59 జీపీలు ఏకగ్రీవమయ్యాయి.

విడతల వారీగా..
గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విడతల వారీగా పరిశీలిస్తే.. తొలి విడతలో 510గ్రామ పంచాయతీలకుగాను.. 132 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో 482 గ్రామ పంచాయతీలకుగాను.. 122 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేశారు. మూడో విడతలో 514 గ్రామ పం చాయతీలకుగాను.. 96 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడతలో ఆదిలాబాద్ జిల్లాలో 153 జీపీల కు 50, నిర్మల్ జిల్లాలో 134 జీపీలకు 57, మంచిర్యాల జిల్లాలో 110 జీపీలకు 7, ఆసిఫాబాద్ జిల్లాలో 113 జీపీలకు 18 ఏకగ్రీవం చేశారు. రెండో విడతలో ఆదిలాబాద్ జి ల్లాలో 149 జీపీలకు 64, నిర్మల్ జిల్లాలో 131 జీపీలకు 25, మంచిర్యాల జిల్లాలో 95 జీపీలకు 14, ఆసిఫాబాద్ జి ల్లాలో 107 జీపీలకు 19 ఏకగ్రీవం చేశారు. మూడో విడతలో ఆదిలాబాద్ జిల్లాలో 163 జీపీలకు 55, నిర్మల్ జిల్లాలో 131 జీపీలకు 9, మంచిర్యాల జిల్లాలో 106 జీపీలకు 10, ఆసిఫాబాద్ జిల్లాలో 114జీపీలకు 22 ఏకగ్రీవం చేశారు.

కొత్త జీపీలే ఎక్కువ..
కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లోనే ఎ క్కువగా ఏకగ్రీవమయ్యాయి. ముఖ్యంగా తండా లు, గూడేల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో గతంలో ఆరు మండలాలుండగా.. కొత్తగా 18 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామ పంచాయతీలు 24కు చేరగా.. ఇందులో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ 26 గ్రామ పంచాయతీలుంటే.. 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమవడమే మంచి ఉదాహరణ. ప్రభుత్వం నుంచి వచ్చే రూ.10 లక్షల నజరానాతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రోత్సాహకంగా ఎన్ నిధులు ఇస్తుండడంతో.. గ్రామాలు ప్రగతి బాటన పట్టనున్నా యి. గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడంతో పెద్ద ఎత్తున మద్యం, డబ్బులు, మాంసం, ఇతర నజరానాల కోసం అభ్యర్థులు ఆర్థికంగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. ఏకగ్రీవాలు చేయడంతో ఎలాం టి పెట్టుబడులు లేకుండా మంచి వారిని ఎన్ను కొనేందుకు అవకాశం లభించింది. మరోవైపు గ్రా మాల్లో ఘర్షణలు, గొడవలు లేకుండా అంతా కలి సి ఉండేందుకు ఈ ఏకగ్రీవాలు ఉపయోగపడ్డా యి. పెద్దఎత్తున ప్రభుత్వ నజారానాతో పాటు ప్రత్యేక నిధులు వస్తుండడంతో ఏకగ్రీవమైన పంచాయతీలకు మహర్దశ పట్టనుంది.

ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీలు 169
ఆదిలాబాద్ రూరల్ 12, బేలలో 9, జైనథ్ 6, తాంసిలో 8, భీంపూర్ 15, గుడిహత్నూర్ 9, బజార్ 11, బోథ్ 12, నేరడిగొండలో 16, తలమడుగులో 16, ఉట్నూరు 17, ఇచ్చోడ 6, సిరికొండ 10, ఇంద్రవెల్లి 9, నార్నూర్ 7, గాదిగూడ 6 చొప్పున ఏకగ్రీవమయ్యాయి.

596
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles