ఓటెత్తిన మహిళా లోకం

Wed,January 23, 2019 01:03 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండగా జిల్లాలో జరుగుతున్నా పంచాయతీ ఎన్నికల్లో 465 జీపీలకు గాను సగం పంచాయతీల్లో మహిళలు సర్పంచ్ ఎన్నికకానున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడంతో పాటు ఓటు హక్కు వినియోగంలో సైతం మహిళలు అగ్రస్థానంలో నిలుస్తున్నారు. జిల్లాలో సోమవారం జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 87,973 మంది ఓటు హక్కును వినియోగించుకోగా ఈ విడతలో 88.27 శాతం పో లింగ్ నమోదైంది. ఇందులో 43,972 మంది పురుషులు ఓటు వేయగా 44,181 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడతలో ఆరు మండలాలు ఆదిలాబాద్ రూరల్, జైనథ్, బేల, మావల, తాంసి, భీంపూర్ ఎన్నికలు జరుగగా బేలలో తప్ప మిగితా మండలాల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 9531 మంది పురుషులు ఓటు వేయగా 9701 మంది మహిళలు, మావలలో 1721 మంది పురుషులు, 1788 మంది మహిళలు, బేలలో 9545 మంది పురుషులు, 9302 మంది పురుషులు, జైనథ్ 15138 మంది పురుషులు, 15231 మంది మహిళలు, తాంసిలో 2968 మంది పరుషులు, 3101 మంది మహిళలు, భీంపూర్ 4889 మంది పురుషులు, 5058 మంది మహిళలు ఓటు వేశారు.

ఓటు వేసేందుకు ఆసక్తి
సోమవారం జరిగిన పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో బారులు తీరారు. యువతులతో పాటు వృద్ధులు సైతం ఓటు వేసేందుకు ఆసక్తి కనపర్చారు. పలు కేంద్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా కనిపించారు. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం పెద్దసంఖ్యలో మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు పంచాయతీలు, వార్డుల్లో మహిళలు ఓట్లు అభ్యర్థులు గెలుపు ఓటములపై ప్రభావాన్ని చూపాయని చెప్పవచ్చు

మహిళల కోసం పలు పథకాలు అమలు
ప్రభుత్వం మహిళల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఫలితంగా ఏ ఎన్నికలు వచ్చినా మహిళలు తమకోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి ఓటు వేసేందుకు కదలివస్తున్నారు. దీం తో వారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతోం ది. ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు వారి పాలిట వరంగా మారాయి. గర్భిణులు, బాలింతల కోసం ఆరోగ్యలక్ష్మి, పేదింటి యువతలు వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, భూమి లేని దళిత కుటుంబాల కోసం మూడెకరాల భూ పంపిణీ, ఆసరా, ఒంటరి మహిళలకు పింఛన్లు, మహిళల రక్షణ కోసం షీ టీమ్ ఏర్పాటు, మహిళా సంఘాల కోసం స్త్రీ నిధి రుణాలు, గర్భిణుల కోసం అమ్మఒడి, కేసీఆర్ కిట్ పంపిణీ లాంటి పథకాల మహిళలకు ఎంతగానో ఉపయోగకరంగా మారాయి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి వారి ఉపాధి మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుంది.

360
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles