మార్కెట్ యార్డుల్లోనే కందులు విక్రయించాలి


Wed,January 23, 2019 01:00 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : రైతులు పం డించిన పంటలను మార్కెట్ యార్డుల్లోనే అమ్ముకొనేలా చూడాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మంగళవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్ ఆధ్వర్యంలో కం దుల కొనుగోళ్లను చేపడుతున్నామని చెప్పా రు. క్వింటాల్ రూ. 5,675 ధర చెల్లించి కొనుగోళ్లు చేస్తున్నారని తెలిపారు. రైతులు త మ సరుకును ఎండ బె ట్టి మార్కెట్ యార్డుకు తీసుకరావాలన్నారు. కందుల్లో వ్యర్థ పదార్థాలు రెండు శాతం, ఇతర పిండి గింజలు మూడు శాతం, దెబ్బతిన్న గింజలు మూడు శాతం, కొద్దిగా దెబ్బతిన్న గిం జలు నాలుగు శాతం, రంగు మారిన గింజలు మూడు శా తం, పుచ్చు గింజలు నాలుగు శాతం, మొత్తం 12శాతానికి మించి ఉండరాదన్నారు. మార్కెట్ యార్డులోనే కందుల కొనుగోళ్లు జరగాలన్నారు. ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కందులు, ఇతర సరుకును కొనుగోలు చేయొద్దన్నారు. రైతులు మార్కెట్ యార్డులోనే విక్ర యించాలని చెప్పారు. ప్రభుత్వ మద్దతు ధరకు తక్కువకు రైతులు కందులను అమ్ముకొని మోసపోవద్దన్నారు. నాణ్యమైన సరుకును తీసుకొచ్చి మంచి ధరను పొందాలని సూ చించారు. ప్రతి రోజూ కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రైతులకు అన్ని వసతులు కల్పించాలని సూ చించారు. మార్కెట్ యార్డులో రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే అధికారులకు తెలియజేయాలన్నారు. మండలాల వారీగా ముందస్తుగా రైతులకు తేదీలను ఖరారు చేసి ఆ తేదీలోనే రైతులు వచ్చేటట్లు చూడాలన్నారు. రైతులందరికీ ఒకే సారి పంట చేతికి వస్తుందని, అందరూ తీసుకరావడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నా రు. కార్యక్రమంలో మార్క్ ఇన్ డీఎం పుల్లయ్య, జిల్లా సహకార అధికారి మోహన్, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శి రాజేందర్, సూపర్ రాజేశ్వర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

325
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles