క్రీడలతో మానసికోల్లాసం

Wed,January 23, 2019 01:00 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని అన్నారు. మంగళవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులకు క్రీడా పోటీలను ప్రారంభించారు. క్యారం ఆడి అందరినీ ఉత్సహ పరిచారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. క్రీడా పోటీలతో ఒకరిపై ఒకరికి స్నేహభావం పెరుగుతోందన్నారు. ఇలాంటి పోటీలను నిర్వహించడం ద్వారా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయటకు వస్తోందన్నారు. క్రీడలతో ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయని చెప్పారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న ఈ పోటీలు ఈ ఏడాది కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. బార్ బెంచ్ అవినాభావ సంబంధం ఉందని, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి లోక్ అదాలత్ కేసుల పరిష్కారం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి చిరంజీవులు, ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి భరత లక్ష్మి, జూనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బిపిన్ కుమార్ పటేల్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కార్యదర్శి బ్రహ్మయ్య, జాయింట్ సెక్రటరీ సుధీర్ కుమార్, ట్రెజరర్ దేవేందర్, స్పోర్ట్స్ సెక్రెటరీ మంగేశ్, లైబ్రరీ సెక్రటరీ చంద్రకాంత్, పీపీ రమణారెడ్డి, న్యాయవాదులు మోహన్ సుధాకర్ పలువురు న్యాయవాదులు ఉన్నారు.

302
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles