కేసీఆర్ కలలను సాకారం చేద్దాం

Wed,January 23, 2019 01:00 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ కన్న కలలను సాకారం చేద్దామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. నూతనంగా ఎన్నికైన ఆయా మండలాల్లోని గ్రామాల సర్పంచులు మంగళవారం డెయిరీ గెస్ట్ హౌస్ కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో గ్రామాలు ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధంగా ఉండేవన్నారు. మెజార్టీ ఉన్న గ్రామాలే అభివృద్ధి చేసుకొనే వార ని, మిగతా చిన్న గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. చిన్న గ్రామ పంచాయతీలతోనే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొత్తగా పంచాయతీలను ఏర్పా టు చేశారన్నారు. దీంతో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారి కల నెరవేరిందన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకులుగా పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం అర్హులకు అందేలా చూడాలని, అప్పుడే సీఎం కేసీఆర్ కలలు నెరవేర్చిన వారమవుతామన్నారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో టీఆర్ పార్టీ క్లీన్ చేసిందని చెప్పారు. పార్టీని ఆదరించి ఓట్లు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు జరగని అభివృద్ధి ఈ ఐదేండ్లలో చేసి చూపించామన్నారు. మరో 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో సీఎంగా కేసీఆరే కొనసాగుతారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని కొనియాడారు.
కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ ఆరె రాజన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఆదిలాబాద్, బేల, జైన థ్ మండలాలకు చెందిన వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles