విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలి

Mon,January 21, 2019 11:28 PM

భైంసా, నమస్తే తెలంగాణ : వలంటీర్లు సేవాభావాన్ని కలిగి ఉండాలని వేదం పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పట్టణంలోని గురుకృపా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనస్సుకు ఆత్మ సంతృప్తినిచ్చేది కేవలం సేవనే అన్నారు. శరీరంలోని మెదడు, హృదయం, జ్ఞానేంద్రియాలు చేసే నిస్వార్థ సేవతోనే ఉత్తేజమవుతాయన్నారు. జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకుంటే విజయం మీ వశమవుందనే సూక్తులతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. యోగా, సాధన వంటివి చేయడంతో ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే.. సమయ నిర్వాహణ ఎలా చేయాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎన్ వలంటీర్లు శ్రీనివాస్ పూలమాల శాలువతో ఘనంగా సత్కరించారు. అంతకు ముందు శిబిరంలో భాగంగా వలంటీర్లు పూలేనగర్ సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి మరుగుదొడ్డి వాడకం, అక్షరాస్యత, విద్యుత్ పొదుపు, ఇంకుడు గుంతల అవశ్యకత వంటి విషయాలను ప్రజలకు తెలియజేశారు. అంగన్ కేంద్రాల్లో పిల్లలకు బీఎంఐ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ముష్కం రామకృష్ణాగౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ సాయినాథ్, ఎన్ ప్రోగ్రాం అధికారి నరేశ్ అధ్యాపకురాలు సంధ్యా తదితరులున్నారు.

113
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles