రాజుకు బహుజన సాహిత్య అకాడమీ అవార్డు


Mon,January 21, 2019 11:28 PM

ఆదిలాబాద్ టౌన్ : సామాజిక సేవా కార్యకర్త పసుపుల రాజు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఈ అవార్డును ప్రదానం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి సంవత్సరం ప్రజా ఉద్యమకారులకు, రచయితలకు, కవులకు, సంఘ సేవకులకు ఈ అవార్డును అందజేస్తున్నారు. 2018 సంవత్సరానికి గాను అవార్డు రాజును వరించడంతో పలువురును ఆయనను అభినందించారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్ దిమ్మ గ్రామస్తులు రాజును శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయడంతోనే తనకు గుర్తింపు లభించిందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలు మరింత స్ఫూర్తినిస్తాయన్నారు. తన సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన అవార్డు కమిటీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్, రాష్ట్ర నాయకురాలు కురపాటి సుధారాణికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్రాల సంజీవ్, కల్లెపెల్లి స్వామి, కౌడ నగేశ్, పుసుపుల నగేశ్, మణికంఠ, ప్రవీణ్ పాల్గొన్నారు.

150
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles