‘కేజీబీవీ’లో కొనసాగుతున్న ప్రయోగాలు

Mon,January 21, 2019 11:27 PM

ఎదులాపురం : కసూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో రాష్ట్ర సమగ్ర శిక్షక్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డిస్ ఆఫ్ ఒకేషనల్ మెటీరియల్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ఉన్న ఇంగ్లిష్ మీడియం కేజీబీవీలో విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు చేసి ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హిమబిందు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి రోజూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 22 అంశాల్లో విద్యార్థులు అవగాహన పొందేందుకు, వారి సామర్థ్యాన్ని పరిశీలించుకునేందుకు ఈ కార్యక్రమం మంచి అవకాశం అన్నారు. ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వం మెడల్స్ బహూకరించనున్నట్లు తెలిపారు.

229
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles