ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి


Sun,January 20, 2019 11:46 PM

జైనథ్ : జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకుడు మహ్మద్ అబ్దుల్ అజీం సూచించారు. ఆదివారం జైనథ్ మండల కేంద్రంలో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించారు. కాగా.. మండలంలో 42 గ్రామ పంచాయతీలకు గాను 6 ఏకగ్రీవంగా ఎంపికయ్యాయని అధికారులు తెలిపారు. 36 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 264 పోలింగ్ స్టేషన్లలో 559మంది ఎన్నికల అధికారులను నియమించినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల కోసం భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన వెంట ఆ ర్డీవో సూర్యనారాయణ, జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సత్యనారాయణ యాదవ్, ఎంపీడీవో రామకృష్ణ, ఆర్‌ఐ సుదర్శన్, తదితరులు ఉన్నారు.


భీంపూర్ : ఎన్నికల సిబ్బంది సమర్థవంతంగా, పారదర్శకంగా పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మహ్మద్ అబ్దుల్ అజీం ఆదేశించారు. ఆయన కలెక్టర్‌తో కలిసి ఆదివారం తాంసి మండల పరిషత్‌లో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోని ఏజెంట్ల సందేహాలు నివృత్తి చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కౌంటింగ్ సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రాలలోకి ఎవరినీ అనుమతించరాదన్నారు. అభ్యర్థుల సంతృప్తి తరువాతే ఫలితాలు విడుదల చేయాలన్నారు. కలెక్టర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ ప్రతి కేంద్రంలోనూ ఉదయం ఏడుగంటలకే పోలింగ్ ప్రా రంభమయ్యేలా చూడాలన్నారు. ఒంటి గంట త రువాత కేంద్రం ఆవరణలో ఉన్న ఓటర్లకు స్లిప్‌లు ఇచ్చి ఓటుకు అనుమతించవచ్చన్నారు. వీరి వెంట ఎంపీడీవో ఆకుల భూమయ్య వివరాలు చెప్పారు. డీఎస్పీ ఎల్వీ నాయక్ , స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు ఉన్నారు.

242
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles