ఖజానా కళకళ

Sun,January 20, 2019 12:38 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : జిల్లా పునర్ విభజన తర్వాత నూతన ఆదిలాబాద్ జిల్లాలో 18మండలాలు ఉన్నాయి. 467 పంచాయతీలుండగా.. 465 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడత ఎన్నికలు ఆదిలాబాద్ రూరల్, మావల, జైనథ్, బేల, తాంసి, భీంపూర్ మండలాల్లో నిర్వహించనుండగా.. ఈనెల 7న నోటిఫికేషన్ విడుదలైంది. అదే రోజు నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 153 గ్రామ పంచాయతీలకు గాను.. సర్పంచ్ స్థానాలకు 530, వార్డు స్థానాలకు 2080 నామినేషన్లు వచ్చాయి. రెండో విడత ఎన్నికల్లో భాగంగా బోథ్, బజార్ నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాలకు 11న నోటిఫికేషన్ వెలువడగా.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 13న ముగిసింది. 163 గ్రామ పంచాయతీలకు గాను.. సర్పంచులకు 562, వార్డులకు 1798 నామినేషన్లు వచ్చాయి. మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ మండలాలకు 16న నోటిఫికేషన్ వెలువడగా.. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం 19న ముగిసింది. ఇందులో 149 పంచాయతీలకు సర్పంచ్ 530, వార్డు సభ్యులకు 2151 నామినేషన్లు దాఖలయ్యాయి. కొంత మంది వార్డు మెంబర్లు, సర్పంచ్ పోటీ చేసే అభ్యర్థులు విత్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పోటీల్లో ఉన్న అభ్యర్థులను బలపరిచే వ్యక్తులకు సైతం ఇంటిపన్ను, నల్లాట్యాక్స్ చెల్లించారు. దీంతో జిల్లా వ్యాప్తం గా క్లస్టర్ హెడ్ నామినేషన్ల స్వీకరణ సమయంలో పన్నులు చెల్లించారు. దీంతో పంచాయతీ శాఖకు దాదాపు రూ.15 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు ఆశాఖ అధికారులు పేర్కొన్నారు.

భారీగా ఆదాయం..
ప్రతి ఏటా పంచాయతీ అధికారులు పన్నులను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వసూలు చేసే వారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో మూడు నెలల ముందస్తు నుంచే పన్ను వసూళ్లకు ప్రణాళికను రచించే వారు. ఈ ఏడాది 2018-19ఆర్థిక సంవత్సరానికి గాను టార్కెట్ రూ.4.74 కోట్లు ఉంది. పన్ను వసూళ్లకు ఇంకా గడువు ఉండడంతో ముందస్తుగా ఎన్నికలు రావడం ఆశాఖ అధికారులకు కలిసి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 18మండలాల్లోని 465 పంచాయతీలకు ఎన్నికలు జరుగనుండగా.. సర్పంచ్, వార్డు మెంబర్లకు మొత్తం 7651 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉప సంహరణ సమయంలో కొంత మంది సర్పంచ్, వార్డు సభ్యులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. వీరిని బలపర్చిన అభ్యర్థులకు సైతం నల్లా, ఆస్తి పన్నులను చెల్లించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించే ఎన్నికల్లో భాగంగా పంచాయతీ శాఖకు దాదాపు రూ.15లక్షల వరకు ఆదాయం సమకూరింది.

245
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles