జామాడకు.. గంగాజల పాదయాత్ర


Sun,January 20, 2019 12:36 AM

నార్నూర్ : కెస్లాపూర్ నాగోబా జాతర కోసం ప్రారంభమైన గంగాజల సేకరణ పాదయాత్ర జామాడ చేరుకొంది. నాగోబా జాతర ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభకానుంది. అందులో భాగంగా నాగోబా దేవతకు నిర్వహించే మహాపూజలకు ఉపయోగించే పవిత్రమైన గంగాజల సేకరణకు మెస్రం వంశీయులు ఈ నెల 16వ తేదీ న పాదయాత్రను మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంక ట్ రావ్ అధ్యక్షతన బయలుదేరారు. బుధవారం పాదయాత్రగా బయలుదేరి మూత్నూర్ బస చేశారు. 17వ తేదీన సాలేవాడా నుంచి ప్రారంభించిన పాదయాత్ర శుక్రవారం సాయంత్రం నార్నూర్ మండలంలోని జామాడ గ్రామానికి చేరుకొంది. గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. గ్రామ పొలిమేరలో బస చేశారు. పవిత్రమైన గంగాజల సేకరణకు తీసుకెళ్లే ఝరికి శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.


అనంతరం మెస్రం వంశీయులకు గ్రామస్తులు భోజనాలు ఏర్పాటు చేశా రు. మెస్రం వంశీయుల అతిథులకు గ్రామస్తులు కానుకలను అందిస్తూ నమస్కరించారు. అనంతరం జామా డ గ్రామం నుంచి గంగాజల సేకరణకు బయలుదేరా రు. ఈ సందర్భంగా మెస్రం వంశీయుల పెద్దలు మా ట్లాడుతూ.. గౌర్రి గ్రామంలో ఆదివారం బస చేస్తామని తెలిపారు. 21న దాబోలి, 22నదేవుడుపెళ్లి, 23న ఇ స్లాంపూర్, 24న కలమడుగు చేరుకొని 25న గంగాపూ జ నిర్వహిస్తామన్నారు. తిరుగు ప్రయాణంలో 27న గౌర్రిలో చేరుకుంటామన్నారు. అక్కడి 31వ తేదీన ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ చేరి ఇంద్రదేవి పూజా నిర్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి ఒకటిన మర్రిచెట్టు, 2న మర్రిచెట్టు(తూమ్), 3న దార్ 4వ తేదీన శ్రీ నాగోబా మాహాపూజ నిర్వహణతో జాతర ప్రారంభమవుతుందన్నారు. 7న శ్రీనాగోబా దర్బార్ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు కా టోడ హన్మంత్ కోసు కాటోడ, జాడియాల్ పో ల్లు, వాడే జంగు, కోత్తాల్ రవి, పర్ధాన్ పండు, కేశవ్, భీంరావు, ధర్ము, దేవ్ తిరుపతి, మాణిక్ మె స్రం దుర్గుపటేల్, మాడవి ముక్తరూప్ కుమ్ర గుణ్ తదితరులు ఉన్నారు.

260
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles