రేపే ‘తొలి’ సంగ్రామం

Sun,January 20, 2019 12:36 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లా లో మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో శనివారంతో ప్రచారం ముగిసింది. ఈ విడత లో జిల్లాలోని ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ రూరల్, మావల, జైనథ్, బేల, బోథ్ నియోజకవర్గంలోని భీంపూర్, తాంసి మండలాల్లో 153 గ్రామ పంచాయతీలు, 1240 వార్డులకు ఎన్నిక లు జరుగాల్సి ఉండగా.. 50 పంచాయతీలు, 592 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పం చాయతీలకు ఈ నెల 14 నుంచి ఆరు రోజుల పాటు నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎ మ్మెల్యే జోగు రామన్న జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్, మావల, మండలాల్లో టీఆర్ బలపర్చిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. జిల్లాలోని మొదటి విడత 103 పంచాయతీల్లో సర్పంచులు, 638 వార్డుల్లో సభ్యుల ఎన్నిక కోసం సోమవారం పోలింగ్ జరుగనుంది.

103 జీపీలకు పోలింగ్..
జిల్లాలోని ఆరు మండలాల్లో 103 పంచాయతీలకు పోలింగ్ జరుగనుంది. భీంపూర్ మండలం లో 11 జీపీలు, ఆదిలాబాద్ రూరల్ మండలం లో 24, బేలలో 26, జైనథ్ 36 పంచాయతీ లు, తాంసిలో ఐదు పంచాయతీలకు ఎన్నికలు జ రుగనున్నాయి. వీటితో పాటు 638 వార్డులకు సైతం పోలింగ్ జరుగనుంది. 638 వార్డులకు 1465 మంది పోటీలో ఉన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని 159 వార్డులకు పోలింగ్ జరుగనుండగా.. 349 మంది అభ్యర్థులు, మా వల మండలంలో 21 వార్డులకు 52 మంది, బేలలో 127 వార్డులకు 280 మంది, జైనథ్ 219 వార్డులకు 479 మంది, తాంసిలో 45 వా ర్డులకు 110 మంది, భీంపూర్ 67 వార్డులకు 195 మంది పోటీ పడుతున్నారు.
ఎక్కువశాతం ఏకగ్రీవాలే..
జిల్లాలో మొదటి, రెండు విడతల్లో ఎక్కువ శాతం టీఆర్ మద్దతు పలికిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగే ఎన్నికల్లో సైతం టీఆర్ బలపర్చిన వారే విజయం సాధించే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టీఆర్ అభ్యర్ధులు గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం ఇలాంటి ఫలితాలే రానున్నాయి.

ఏర్పాట్లు పూర్తి..
మొదటి విడతలో 153 పంచాయతీలు, 1240 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 50 పంచాయతీలు 592 వార్డులు ఏకగ్రీవం అ య్యాయి. దీంతో మిగిలిన 103 పంచాయతీలు, 638 వార్డులకు.. రేపు పోలింగ్ జరగనుంది. ఇం దుకు గాను 318 సర్పంచ్ స్థానాలకు, 1465 మంది వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్నా రు. ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా 80 మంది స్టేజ్-1, 153 మంది స్టేజ్-2 అధికారుల తో పాటు 23 మంది జోనల్ అధికారులు, 28 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. వీటితో పాటు 5 జీపీలను సమస్యాత్మక పంచాయతీలు గా.. 17 జీపీలను హైపర్ సెన్సిటివ్, 10 క్రిటికల్ జీపీలుగా గుర్తించారు. మొదటి విడతలో 1,546 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. సర్పంచుల కోసం 1,11,200, వార్డు సభ్యుల కోసం 85,550 బ్యాలెట్ పేపర్లను సిద్ధంగా ఉంచారు. 103 కౌటింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయగా.. 8 కేంద్రాల్లో వెబ్ జరుపనున్నారు. వీటితో పాటు 21 మంది మైక్రో అబ్జర్వర్స్, మరో నలుగురు ఫ్లయింగ్ స్కాడ్స్ నియమించారు.

154
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles