టీఆర్‌ఎస్‌తోనే గ్రామ స్వరాజ్యం

Sat,January 19, 2019 12:00 AM

ఆదిలాబాద్ రూరల్ : గ్రామ పంచాయ తీ వార్డు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే గ్రామ స్వరాజ్యం స్థాపించుకోవచ్చని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ న్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో అర్లి(బి) గ్రామ పంచాయతీలో మొ దటి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించా రు. టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందితే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా తమ పార్టీ బలపర్చిన 114 మంది సర్పంచ్ అభ్యర్థుల ను గెలిపించుకొంటే గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి నుంచి నిధులు ఎక్కువ మొ త్తంలో రాబట్టుకోవచ్చని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలుంటాయని అనంతరం అందరూ కలిసి అభివృద్ధికి పాటు పడాలన్నారు. ఇతర పార్టీ అభ్యర్థులు గెలుపొందితే అభివృద్ధికి ఆటంకాలు జరిగే అవకాశాలుంటాయని తెలిపారు. గ్రామాల్లో బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పేర్కొనడం హాస్యాస్పదం గా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆరోపించడం విడ్డూరమని, జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయి ఉండి అనేక భూ కబ్జాలకు పాల్పడ లేదా అని ప్రశ్నించారు. ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతూ ప్రజలకు సేవలందిస్తున్న తనను మరో మారు ఎమ్మెల్యేగా గెలిపించారని గు ర్తు చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించుకొనేందుకు కష్టపడిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే గ్రామాల్లో టీఆర్‌ఎస్ మ ద్దతుదారులను గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నానన్నారు.

162
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles