అభివృద్ధిని చూసి ఓటు వేయండి


Sat,January 19, 2019 12:00 AM

జైనథ్ : రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మండలంలోని అడ, రాంపూర్ గ్రామాల్లో శుక్రవారం ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నూతనంగా ఎన్నికై న ఎమ్మెల్యేలను సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 114 సర్పంచు ల్లో 30 సర్పంచులు ఇదివరకే ఏకగ్రీవం అయ్యారని, మిగతా 84 సర్పం చ్ స్థానాలకు అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో టీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే బలం పెరి గి నిధులు ఎక్కువగా మంజూరయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. గ్రా మాల్లో ప్రతి పక్షాల మాటలు నమ్మి టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన వ్యక్తులకు కాకుండా ఇతర పార్టీల వ్యక్తులకు ఓటు వేసి అభివృద్ధిని అడ్డుకోవద్దన్నా రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులతో పాటు అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. మండల నాయకులు తుమ్మల వెంకట్‌రెడ్డి, లింగారెడి, గిమ్మ సంతోష్‌తో పాటు అభ్యర్థులు లింగన్న, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

157
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles