ముగిసిన నామినేషన్ల ప్రక్రియ


Fri,January 18, 2019 11:59 PM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ విడతలో ఆరు మండలాల్లోని 163 పంచాయతీలు, 1,358 వార్డులకు ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో మూడ్రోజులుగా అభ్యర్థులు సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. శుక్రవారంతో గడువు ముగియగా.. 163 పంచాయతీలకు 562 నామినేషన్లు, 1,358 వార్డులకు 1,798 నామినేషన్లు దాఖలయ్యాయి.


జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. చివరిరోజు వివిధ మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ పడుతున్న అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మూడో విడతలో 163 పంచాయతీలకు 562 నామినేషన్లు, 1,358 వార్డు స్థానాలకు 1,798 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇచ్చోడ మండలంలోని 32 పంచాయతీలకు గానూ సర్పంచ్ 170 , 368 వార్డు స్థానాలకు 557 నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగు పంచాయతీల్లో ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలైంది. సిరికొండలో మండలంలో 19 గ్రామ పంచాయతీలకు గానూ స ర్పంచ్‌కు 50, 148 వార్డు స్థానాలకు 202 నామినేషన్లు దాఖలయ్యాయి.

10 జీపీలకు సింగిల్ నామినేషన్ వచ్చింది. ఇంద్రవెల్లి మండలంలో 28 పంచాయతీల్లో సర్పంచ్‌కు 87, 236 వార్డు స్థానాలకు 255 నామినేషన్లు దాఖలయ్యా యి. 7 జీపీల్లో సర్పంచ్ స్థానానికి ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేశారు. ఉట్నూర్ మండలంలో 36 పంచాయతీలుండగా.. సర్పంచ్‌కు 122 నామినేషన్లు 312 వార్డులకు గానూ 453 నామినేషన్లు దాఖలయ్యాయి. 16 జీపీల్లో సింగిల్ నామినేషన్ వచ్చింది. నార్నూర్ మండంలో 23 పంచాయతీలు 71 నామినేషన్లు, 198 వార్డులకు 246 నామినేషన్లు, గాదిగూడ మండలంలో 25 పంచాయతీల్లో సర్పంచ్‌కు 62 నామినేషన్లు, 196 వార్డు స్థానాలకు 223 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు నామినేషన్ల పరిశీలన కొనసాగనుండగా.. అభ్యంతరాల స్వీకరణ అనంతరం 22న ఉప సంహరణకు అవకాశం ఉంటుంది.

భారీగా ఏకగ్రీవాలు..
మొదటి, రెండో విడతతో పాటు మూడో విడతలోనూ ఏకగ్రీవాలు జోరందుకున్నాయి. మొత్తం ఆరు మండలాల్లో 163 సర్పంచ్, 1,358 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. అందిన సమాచారం ప్రకారం సుమారు 50 జీపీలు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది.

117
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles