ధర్మ పరిరక్షణలో కృష్ణుడి పాత్ర కీలకం


Sun,August 25, 2019 03:02 AM

-ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్
న్యూశాయంపేట, ఆగస్టు 24: ధర్మ పరిరక్షణలో శ్రీకృష్ణుడి పాత్ర కీలకమని వరం గల్ పశ్చిమ ఎమ్మెల్యే దా స్యం వినయ్‌భాస్కర్ అన్నారు. నగరంలోని బాలసము ద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, రేవతి దంపతుల ఆధ్వర్యంలో వారి పిల్లలు గోపిక, చిన్నికృష్ణుడి వేషధారణతో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని పిల్లల కేరింతల నడుమ ఉత్సాహంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారతీయ సంస్కృ తీ, సంప్రదాయాలకు ఆకర్షితులై అ నుసరి స్తున్నాయన్నా రు. అటువంటి గొప్ప సంస్కృతి గల దేశంలో పుట్టడం మన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆ గ్రోస్ చైర్మన్ లిం గంపల్లి కిషన్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పులి రజనీకాంత్, చాగంటి రమేశ్, విద్యార్థులు, కాలనీవాసులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...