అవకాశాలను అందిపుచ్చుకోవాలి


Sat,August 24, 2019 03:18 AM

-మైలాన్ లాబోరేటరీస్ డిప్యూటీ మేనేజర్ బుచ్చిరెడ్డి
కాజీపేట, ఆగస్టు 23: ఫార్మ రంగంలో వనరులు, ఉద్యోగ అవకాశాలను విద్యార్థ్ధులు అందిపుచ్చుకోవాలని మైలాన్ లాబోరేటరీస్ డిప్యూటీ మేనేజర్ బుచ్చిరెడ్డి అన్నారు. కాజీపేట శివారులోని నేతాజీ ఫార్మసీ కళాశాలలో ఫార్మ రంగంపై శుక్రవారం విద్యార్థ్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మ రంగంలో ఔషధాల పరిశోధన, తయారీ రంగం, మార్కెటింగ్ రంగంలో ప్రావీణ్యం సాధించిన విద్యార్థ్ధులకు అన్ని రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. కళాశాల డైరెక్టర్ ఇనుగాల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఫార్మ రంగంలో నైపుణ్యం సాధించిన వారికి భవిష్యత్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాబురావు, యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థ్ధులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...