మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు


Sat,August 24, 2019 03:17 AM

కమలాపూర్ : మత్య్సకారుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు మత్స్యశాఖ ఎఫ్‌డీవో విజయభారతి అన్నా రు. శుక్రవారం మండలంలోని ఉప్పల్ పెద్దచెరువు, చిన్నచెరువులో చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికం గా ఎదిగేందుకు చేప పిల్లలను అందజేస్తుందన్నారు. బొచ్చ, రవ్వుల సీ డ్‌ను పంపిణీ చేస్తున్నామని, పెద్ద, చిన్న చెరువుల్లో లక్షా 50వేల చేపపిల్లలను పోసినట్లు వెల్లడించా రు. మత్స్యకార్మికుల కోసం నాణ్యమైన సీడ్‌ను ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రబెల్లి దేవేందర్‌రావు, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి సంపత్‌రావు, ఉప సర్పంచ్ మొర్రి ఓదెలు, కో ఆప్షన్ సభ్యుడు చోటేమియా, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పీఆర్ మోహన్, వార్డు సభ్యుడు ఎర్రబెల్లి శ్రీధర్‌రావు, నాయకులు తూ ర్పాటి క్రాం తి, కొంరయ్య, ముదిరాజ్ కులస్థులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...