ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు


Sat,August 24, 2019 03:17 AM

మట్టెవాడ : వరంగల్ నగరంలో పరమపావణమైన శ్రీభద్రకాళీ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం జరిపిన పిమ్మట అమ్మవారి అనుజ్ఞతో శ్రీకృష్ణజన్మాష్టమి వ్రతం, విష్ణుపంచాయతన యాగం నిర్వహించి భక్తులు ఉపవాసదీక్షతో వ్రతాన్ని ఆచరించారు. విశేష కార్యక్రమాల అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భ క్తులు ఉదయం నుంచే బారులుతీరారు. సా యంత్రం అమ్మవారిని శ్రీకృష్ణుడిగా అలంకరించి విశేషపూజాధికములు నిర్వహించా రు. అమ్మవారిని కృష్ణుడిగా అలంకరించడానికి దాదాపు గంట సమయం పట్టింది. అలంకరణ పూర్తికాగానే సాయంత్రం శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న అమ్మవారికి పూజలు చేసి 21రకాల బోగములను నివేదించారు. అలాగే శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో ఆర్ సునీత, సిబ్బంది తదితరులు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అమ్మవారిని ప్రత్యేక పూజలు అర్చనలు ఆలయ ప్రధానార్చకులు శ్రీభద్రకాళీ శేషు ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతే కాకుండా వరంగల్ హంటర్‌రోడ్‌లోని సంతోషిమాత ఆలయంలో, ఎంజీఎం సమీపంలోని శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.

గోపిక, కృష్ణుడి వేషధారణలో చిన్నారులు..
వరంగల్ క్రైం: నయీంనగర్‌లోని షైన్ పాఠశాలలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఆయన సతీమణి రేవతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూతురు, కుమారుడితో వేడుకలకు హాజరై ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిన్నారులు గోపిక, కృష్ణుల వేషధారణలో ముస్తాబయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మూగల కమారస్వామి, ప్రధానోపాధ్యాయురాలు కవితారాణి, డైరెక్టర్ వేణుయాదవ్, రాజేంద్రకుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో..
సిద్ధార్థనగర్ : హన్మకొండ బాలసముద్రంలోని ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం కృష్ణాష్టమి వేడుకల సంర్భంగా శ్రీకృష్ణుడు సందడి చేశాడు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ కుమారుడు కృష్ణవ్ భాస్కర్ శ్రీకృష్ణుడి వేషధారణ, కుమార్తె క్రిషిత గోపిక వేషధారణలో సందడి చేశారు. దీంతో క్యాం ప్ కార్యాలయంలో వీరి అల్లరితో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్-రేవతి దంపతు లు, ప్రజలు సం తోషం వ్యక్తం చేశారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...