అలసిపోయే కొద్దీ నూతన శక్తిని సంపాదించుకోవాలి


Fri,August 23, 2019 03:26 AM

సిద్ధార్థనగర్, ఆగస్టు22: అలసిపోయే కొద్దీ నూతన శక్తిని సంపాదించుకుని ముందుకు సాగాలని హాలీవుడ్ డాక్యుమెంటరీ డైరెక్టర్, ఎడిటర్, నిర్మాత జాన్‌డున్‌యమ్ అన్నారు. గురువారం ఫాతిమానగర్‌లోని బాలవికాస సంస్థ్ధ ట్రైనింగ్ సెంటర్‌లో 350మంది బాలవికాస మహిళాభివృద్ధి కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ఆయనతో పాటు ఆయన సతీమణీ ఆంటోనియెట్టా ముఖ్యఅతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్యుమెంటరీ స్ప్రిరిట్ ఆఫ్ ది మారథాన్ అమెరికా, కెనడా వ్యాప్తంగా సుమారు 500కుపైగా థియేటర్లలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన డాక్యుమెంటరీగా రికార్డు సాధించిందని, ఈ సినిమా ద్వారా మహిళలు కూడా మారథాన్‌లో పాల్గొని చైతన్యపరిచారని అన్నారు. ఈ సినిమా 2007 చికాగో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రీమియరింగ్‌లో గౌరవనీయమైన ప్రేక్షకుల అవార్డు, ప్రశంసలు పొందినదని ఆయన తన ప్రస్తానం గూర్చి గుర్తు చేశారు.

అనంతరం బాలవికాస సేవలను కొనియాడుతూ బాలవికాస సంస్థ్ధతో కలిసి పని చేయడానికి సిద్ధ్దంగా ఉన్నానని అన్నారు. అనంతరం బాలవికాస సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి మాట్లాడుతూ ఒక సైనికుడు తన దేశాన్ని రక్షించుటకు శ్రమిస్తే, బాలవికాస మహిళలు తమని తాము రక్షించుకుంటూ గ్రామాభివృద్ధికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అనన్నారు. మహిళలకు అనేక రకాల శిక్షణలు, సమస్యల పరిష్కారాల ఆర్థ్ధిక, సామాజిక, సాంఘిక సమస్యలపై అవగాహన కల్పించి వారి ఎదుగుదలతో గ్రామాన్ని అభివృద్ధ్ది పథంలో నడిపేలా బాలవికాస ముందంజంలో ఉందని జాన్‌కు వివరించారు. సమావేశంలో బాలవికాస సిబ్బంది లత, బాల థెరిసా, భాగ్య, జ్యోతి, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...