ఘనంగా మెగాస్టార్ చిరు జన్మదిన వేడుకలు


Fri,August 23, 2019 03:25 AM

హసన్‌పర్తి, ఆగస్టు 22: మండలంలోని ఎర్రగట్టుగుట్ట అభయాంజనేయ స్వామి దేవాలయంలో గురువారం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిరంజీవి అభిమానులు ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నారిచే కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించి స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో చిరంజీవి ప్రజా సేవా సమితి ఫ్యాన్స్ జిల్లా నాయకులు బోడ యుగంధర్, పుల్ల దుర్గారాం, బొక్క కుమార్, డ్యాన్స్ మాస్టర్ గోపరాజు కుమార్, మేకల రమేశ్, మట్టెడ హరి, నరోత్తంరెడ్డి, భిక్షపతి, సుభాశ్, ఎస్టీ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...