శ్రీకృష్ణ జన్మాష్టమి పోస్టర్ ఆవిష్కరణ


Fri,August 23, 2019 03:25 AM

కరీమాబాద్,ఆగస్టు22: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24న వరంగల్‌లోని రాధాకృష్ణ గార్డెన్‌లో చేపట్టనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాల పోస్టర్‌ను గురువారం మేయర్ గుండా ప్రకాశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ బజ్జూరి ఆర్గనైజేషన్ ఫర్ స్పిరుచువల్ అండ్ కల్చరల్ అవేర్‌నెస్ వరంగల్, శ్రీకృష్ణ సొసైటీ హన్మకొండ ఆధ్వర్యంలో భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమన్నారు. కార్యక్రమాలకు సహకరిస్తామన్నారు. ఈ నెల 24న వరంగల్‌లోని రాధాకృష్ణ గార్డెన్‌లో నిర్వహించనున్న భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...