ఘనంగా మడేలయ్య ఉత్సవాలు


Thu,August 22, 2019 03:06 AM

రెడ్డికాలనీ, ఆగస్టు 21: ములుగురోడ్‌లోని గద్దె వద్ద హన్మకొండ పట్టణ రజకులు కుల ఆరాధ్య దైవం మడేలయ్య స్వామి బోనాలు, ఉత్సవాలు సాంప్రదాయ రీతిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పురుషులు, మహిళలు బోనాలు ఎత్తుకొని నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక నవ నిర్మాణ సంఘం అధ్యక్షుడు చీకటి రాజు మాట్లాడుతూ ములుగురోడ్‌లోని సొంత స్థలంలో మడేలయ్య శాశ్వత దేవాలయం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సాంబరాజు ఐలోని, చీకటి ప్రభాకర్, రాచర్ల కనకయ్య, గంగరాజు రాజు, చీకటి సారంగపాణి, చీకటి ఆనంద్, చీకటి శ్రీనివాస్, సాంబరాజు శివానందం, రాచర్ల లక్ష్మీనారాయణ, చీకటి సాంబయ్య, గంగరాజు సారంగపాణి, పాండ్రాల సరస్వతి, సాంబరాజు కళ్యాణి, రవళి పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...