ఆటోడ్రైవర్లు ఐక్యంగా ఉండాలి..


Thu,August 22, 2019 03:06 AM

రెడ్డికాలనీ, ఆగస్టు 21: ఆటోడ్రైవర్లు అందరూ ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని మన తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఇసంపెల్లి సంజీవ అన్నారు. బుధవారం రుద్రమదేవి ఆటోయూనియన్ హన్మకొండ బస్టాండ్ అడ్డా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మెట్టు శ్రీనివాస్(శివ), ప్రధాన కార్యదర్శిగా సంజీవ, ఉపాధ్యక్షుడిగా యెర్ర మల్లయ్య, కోశాధికారిగా ఎన్ రమణారెడ్డిని ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో మన తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్ నాయకులు మడికొండ బాబు, యాకుబ్‌పాషా, చీకటి కుమార్, మామిడాల వెంకన్న, బొల్లం సంజీవ, గుండా రమేశ్, రాయరాకుల రమేశ్, మనోమర్, సురేశ్, కృష్ణ, శ్రీనివాస్, జింతి, రాజు, వెంకటస్వామి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...