విద్యతోనే ఉజ్వల భవిష్యత్..


Thu,August 22, 2019 03:05 AM

-జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి
న్యూశాయంపేట,ఆగస్టు21: విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డీఈవో కే నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కేస్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ ఇండియా సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాంలో భాగంగా హన్మకొండ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్‌కు మల్టీమీడియా ఎడ్యుకేషన్ ప్రొజెక్టర్ కేస్ కిట్(ప్రొజెక్టర్) పరికరాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం ఉప్పలయ్య అధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశానికి డీఈవో నారాయణరెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థుల చదువు కోసం సాయం చేస్తే భవిష్యత్ తరాలకు సాయం చేసినట్లేనని అన్నారు. సంస్థలు, వ్యక్తులు విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన కోసం ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు ఉన్నతంగా రాణించి భవిష్యత్‌లో మంచి పౌరులుగా ఎదగాలన్నారు. కేస్ కంపెనీ స్టేట్ హెడ్ సుద్దోజు స్వామి మాట్లాడుతూ కేస్ కిట్ ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎంఈవో వీరభద్రనాయక్, కేస్ ప్రతినిధులు రాజశేఖర్, శ్రీనివాస్, రుషిందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...