ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలి


Wed,August 21, 2019 03:47 AM

-ఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి
వరంగల్,నమస్తేతెలంగాణ: ప్లాస్టిక్ నిర్మూలనకు నగర ప్రజలు సహకరించాలని ఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి అన్నారు. సీకేఎం ఆసుపత్రి వీధిలోని పలు షాపులలో ఎంహెచ్‌వో అదేశాలతో ప్రజారోగ్య విభా గం మంగళవారం నిర్వహించారు. చికెన్, పూల వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవ ర్లు వినియోగిస్తుండటంతో వారి నుంచి రూ. 10 వేలు జరమానా వసూళ్లు చేశారు. 30 కీలోల ప్లాసిక్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. 50 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చికెన్ సెంటర్ల ముందు ప్లాస్టిక్ కవర్లు నిషేధం, టిఫిన్స్ బాక్స్‌లు తీసుకురావాలి అంటూ బోర్డులు ప్రదర్శించాలని సూచించారు. ఈ తనిఖీలల్లో సానిటరీ సూపర్‌వైజర్ సుధాకర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు ధరంసింగ్, శ్యామ్‌రాజ్, కుమారస్వామి, శ్రీనివాస్, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...