విద్యార్థులు క్రీడల్లో రాణించాలి


Wed,August 21, 2019 03:46 AM

కమలాపూర్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని వరంగల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మంత్రి సోదరుడు ఈటల భద్రయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలన్నారు. మండలంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులు హాజరై ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ తడక రాణి, జెడ్పీటీసీ లాండిగ కల్యాణి, సర్పంచ్ కట్కూరి విజయరెడ్డి, ఎంఈవో రాంకిషన్‌రాజు, ప్రధానోపాధ్యాయులు రాంరెడ్డి, పవన్‌కుమార్, పీఈటీ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...