పండుటాకులబతుకులకు భరోసా


Sun,July 21, 2019 01:38 AM

రాయపర్తి, జూలై 20 : జీవిత చరమాంకంలో అచేతనావస్థలో ఉండి కన్న బిడ్డల చేత నిత్యం చీత్కరింపులకు గురవుతూ ఆకలి చావులకు దగ్గరలో ఉన్న రాష్ట్రంలోని పండుటాకుల (వయో వృద్ధులు) జీవితాలు, బతుకులు, భవిష్యత్‌కు ఆసరా పింఛన్ పథకంతో భరోసా కల్పించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఆవరణలో శనివారం ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అధ్యక్షతన ని ర్వహించిన పెరిగిన ఆసరా పింఛన్ల ప్రోసీడింగ్స్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరితతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ద యాకర్‌రావు మాట్లాడుతూ తమకు జన్మనిచ్చిన తల్లిందండ్రు లు, వితంతువులుగా మారిన తోబుట్టువులు, అంగ వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులు, కుల వృత్తులపై ఆధాపడి వృద్ధ్దాప్యానికి చేరిన అస్సాహాయులను కుటుంబ సభ్యులు, రక్త సం బందీకులు కూడా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ పార్టీ అధినేతగా సుధీర్ఘ కాలంపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల మధ్య అనునిత్యం తిరుగాడిన నేతగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్రంలోని సకల ప్రాంతాలు, సబ్బండ వర్గాల ప్రజలు ఎదుర్కోంటున్న కష్టాలు, అవస్థలు, ఇబ్బందులపై సంపూర్ణ అవగాహన ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రంలో జరిగిని సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్లను అధికారంలోకి రాగానే రెట్టింపు చేస్తామని సీఎం కేసీఆర్ తన ఎన్నికల మ్యానిఫేస్టోలో ప్రకటించినట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పింఛన్లను డబుల్ చేస్తూ ప్రోసీడింగ్స్ పత్రాలను అందజేస్తున్నామని, రెండు రోజులలోనే పింఛన్ల సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయబడుతాయని ఆయన వివరించారు.

నిరుపేద ఆడబిడ్డల పెండ్లీలకు సర్కారు సాయం
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, సబ్బండ వర్గాలకు చెందిన ని రుపేద ఆడబిడ్డల పెండ్లీలకు ప్రభుత్వమే అండగా నిలువాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడబిడ్డల వివాహాలకు రూ.1,00116 అందజేస్తూ సీఎం కేసీఆర్ పెండ్లీల పెద్దగా మారారని మంత్రి వివరించారు. అనంతరం కలెక్టర్ ముండ్రాతి హరితతో కలిసి లబ్ధిదారులకు ఆసరా పెన్షన్‌ల పెం పు ప్రోసీడింగ్స్ పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారకర్ నగదు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో వరంగల్ రూరల్ ఆర్డీవో మహేందర్‌జీ, డీఆర్డీఏ సంపత్‌రావు, డీపీవో నారాయణ, ఇన్‌చార్జి తహసీల్దార్ గుజ్జుల రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్, నాయబ్ తహసీల్దార్లు రాజేశ్‌ఖన్నా, అల్లం రాజ్‌కుమార్, ఇన్‌చార్జి ఎంపీడీవో మామిడాల రాజన్న, ఎంఈవో నోముల రంగయ్య, ఈవోపీఆర్డీ తక్కళ్లపల్లి రాజ్యలక్ష్మి, ఏపీవో దొనికెల కుమార్‌గౌడ్, ఏపీఎం అశోక్‌కుమా ర్, పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు గారె నర్సయ్య, బిల్లా రాధిక, అయిత రాంచందర్, కర్ర సరిత, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, బండి అనూష, పలమాస సారయ్య, జగన్‌నాయక్, భద్రూనాయక్, లకావత్ సమ్మక్క, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, బిల్లా సుధీర్‌రెడ్డి, కాంచనపల్లి వనజారాణి, ఎండీ ఉస్మాన్, ఆశ్రఫ్‌పాషా, సంతోష్‌గౌడ్, సాగర్‌రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...