డయల్100 కు స్పందించిన ఎస్సై.. పోలీసు సిబ్బందిని అభినందించిన ఏసీపీ, సీఐ


Fri,July 19, 2019 03:52 AM

పరకాల, నమస్తే తెలంగాణ : కలహాలతో భార్యాపిల్లలను భర్త ఇంట్లో ఉంచి తాళం వేయగా వారిని పరకాల పోలీసులు సురక్షితంగా కాపాడారు. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల పట్టణంలోని పిట్టవాడకు చెందిన మార్క రవికి రేగొండ మండలం పొనగల్లు గ్రామానికి చెందిన రాధికతో 20సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వారి దాంపత్యజీవితం సాఫీగానే సాగింది. ఆరు సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి రాధిక భర్త రవి తన భార్య, పిల్లలను ఇంట్లోనే ఉంచి తాళం వేసి బయటకు వెళ్లాడు. దాంతో ఇంట్లో బంధీగా ఉన్న వారు 100కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన పరకాల ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, బ్లూకోల్ట్స్ సిబ్బంది పీసీ ఆఫీసర్ సంతోశ్, హోంగార్డ్ ఆఫీసర్ సంతోశ్‌కుమార్ సంఘటన స్థలానికి వెళ్లారు. తాళం వేసి ఉన్న ఇంట్లోని కిటిలో నుంచి ప్రవేశించి రాధిక చేతిలో ఉన్న పురుగులమందు డబ్బాను లాగేసుకున్నారు. ఆమె పురుగులమందు సేవించానని పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన పోలీసుజీపులో పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పురుగుల మందు సేవించలేదని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. 100కు కాల్‌చేయగానే స్పందించి ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, బ్లూకోల్ట్స్ సిబ్బందిని ఏసీపీ వైవీఎస్ సుధీంద్ర, సీఐ జీ మధుతోపాటు ప్రజలు అభినందించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...