నాటిన ప్రతీ మొక్కను కాపాడాలి


Thu,July 18, 2019 03:55 AM

ఎల్కతుర్తి: హరితహారంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను కాపాడాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. హరితహారంలో భాగంగా బుధవారం మండలంలోని సూరా రం గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమిలో మొక్కలు నాటా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పాటిల్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత హరితహారాల్లో దాదాపుగా 3 కోట్లకుపై గా మొక్కలు నాటినప్పటికీ, వాటిని కాపాడలేకపోయారన్నారు. హరితహారాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రతి పౌరుడు తన బాధ్యతగా స్వీకరించాలని చెప్పారు. ఇండ్ల ముం దు కనీసం 5 మొక్కలు నాటుకోవాలని సూచించారు. గ్రామా ల్లో సర్పంచ్, కార్యదర్శి ఆధ్వర్యంలో హరితహారం కమిటీలు వేసుకోవాలని చెప్పారు. వీడీవో, సర్పంచ్, కార్యదర్శి నాటిన మొక్కలను పర్యవేక్షించి వాటిని కాపాడాలని తెలిపారు.

ప్రతి 1000 మొక్కలకు ఒక వాచర్‌ను నియమించాలని అధికారుల కు సూచించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు హరితహారంలో నాటిన మొక్కల వివరాలను రాయించాలని పే ర్కొన్నారు. హరితహారంలో ప్రత్యేక శ్రద్ధ చూపి 80శాతం మొక్కలను కాపాడిన గ్రామాలను ప్రతి మండలానికి 3 చొప్పున ఎం పిక చేస్తామని, అలాగే మండలస్థాయిలో కూడా ఎంపిక చేసి అ భివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. భావితరాలకు చెట్లు చాలా అవసరమని, అందుకే మన బాధ్యతగా మొక్కలు నాటుదామని వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ రా ము, ఎంపీపీ మేకల స్వప్న, మండల ప్రత్యేకాధికారి నీరజ, ఏ డీఏ దామోదర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, తహసీల్దార్ వెం కటరమణ, ఎంపీడీవో ఇందుమతి, సర్పంచ్ కుర్ర సాంబమూ ర్తి, ఫారెస్టు రేంజ్ అధికారి మయూరి, ఈవోపీఆర్డీ జయంత్‌రెడ్డి, ఎంఈవో ఈసరి రవీందర్, ఏపీవో అనిత, ఏపీఎం రవీందర్, ఆర్‌ఐ శ్రీధర్, నాయకులు పిట్టల మహేందర్, మేకల సుదర్శన్, మేకల కోమల, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

డ్రమ్‌సీడర్ విధానాన్ని ప్రోత్సహించాలి
డ్రమ్‌సీడర్ పద్ధతి ద్వారా వరిసాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అధికారుల కు సూచించారు. మండలంలోని దండేపల్లి గ్రామంలో రైతు వర్ధెల్లి అన్నారావు డ్రమ్‌సీడర్ ద్వారా వరి సాగు చేస్తున్న విధానాన్ని క్షే త్రప్రదర్శనలో ఏడీఏ దామోదర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా వ చ్చే లాభాలను రైతు అన్నారావును అడిగి తెలుసుకున్నారు. డ్రమ్‌సీడర్ పద్ధతిలో వరి సాగు చేస్తే పెట్టుబడులు తక్కువ అవడమే కాకుండా అధిక దిగుబడులు సాధించవచ్చని రైతు చెప్పారు. అదేవిధంగా తక్కువ కాలంలోనే పంట దిగుబడి వస్తుందని వివరించారు. డ్రమ్‌సీడర్ ద్వారా జిల్లావ్యాప్తంగా సాగవుతున్న వరి పంటల వివరాలను ఏడీఏ దామోదర్‌రెడ్డిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. అయితే డ్రమ్‌సీడర్‌ను కొనుగోలు చేయాలంటే రైతులకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని, సబ్సిడీపై యంత్రాలను అందించాలని రైతులు కలెక్టర్‌ను కోర గా, వ్యవసాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. తక్కువ రోజుల్లో అధిక దిగుబడిని చ్చే ఇటువంటి వాటిపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, తహసీల్దార్ వెం కటరమణ, సర్పంచ్ ప్రమీలప్రతాప్, ఏవో రాజుకుమార్, ఆ త్మ బీటీఎం సంతోషిమాత, ఏఈవోలు రాజు, కళ్యాణి, అఖిల, తిరుపతి, పంచాయతీ కార్యదర్శి లావణ్య పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...