బాలల ఆరోగ్యానికి భరోసా


Thu,July 18, 2019 03:53 AM

ఎంజీఎం: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్యరంగానికి పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రీయ బాలల స్వస్థ్య రక్షణ (ఆర్‌బీఎస్‌కే) పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని సంకల్పించారు. ఇందు కోసం ఎంజీఎం దవాఖానలోని పి ల్లల వైద్య విభాగానికి సమీపంలో ఆధునిక వసతులతో కూడిన భవన సముదాయాన్ని నిర్మించారు. రంగు రంగుల బొమ్మలను గోడలపై వేసిన తీరు కార్పొరేట్ సంస్థలను సవాల్ చేస్తోంది. అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనంలో పూ ర్తిస్థాయిలో చిన్నారులకు సేవలందించడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఆధునిక వసతులతో నిర్మితమైన ఆర్‌బీఎస్‌కేలో అ ప్పుడే పుట్టిన పసిబిడ్డలతో మొదలు పద్దెనిమిదేళ్లలోపు వయస్సు గల వారికి వైద్య సేవలందిస్తున్నారు. పుట్టకతో అనేక రుగ్మతల తో బాధపడే వారికి ఇక్కడ మెరుగైన సేవలందించనున్నారు.

ఏ రుగ్మతలతో బాధపడే వారికి..?
పట్టుకతో చెవుడు, మూగ పిల్లలకు ఇక్కడ నిపుణులు చికిత్స అందిస్తారు. ఆడియాలజిస్టు సదరు పిల్లలకు వినికిడిలోపం ఏ మేరకు ఎంతశాతం ఉన్నది వైద్యపరీక్షల ద్వారా గుర్తిస్తారు. ఆ నక వారిని ఆయా సమస్యల నుంచి మెరుగుపరచి, సాధారణ వ్యక్తుల వలె వినికిడి లోపాన్ని తొలిగించడంతోపాటు మాట్లాడటం కూడా నేర్పించనున్నారు. ఇందుకోసం అవసరమైన వైద్య పరీక్షల పరికరాలు కూడా సమకూర్చిపెట్టారు.

దృష్టిలోపం నివారణకు చికిత్స
దృష్టిలోపంతో బాధపడే చిన్నారులకు ఆర్‌బీఎస్‌కే భవనంలో మెరుగైన చికిత్స అందించనున్నారు. దృష్టిలోపం శాతాన్ని తెలుసుకునేందుకు ఆధునిక వైద్య యంత్రాలను ప్రత్యేక గదిలో ఏ ర్పాటు చేశారు. అంతేగాకుండా కంటి సమస్యలతో బాధపడే పిల్లలకు కూడా ఇక్కడ ఆధునిక పరీక్షల ద్వారా మెరుగైన చికిత్స అందిస్తారు. నేత్ర వైద్య నిపుణులు నిర్ధేశించిన సమయానికి వి ధుల్లో ఉండి రోగులకు చికిత్స అందించనున్నారు.

ఆధునిక యంత్రంతో దంత వైద్య పరీక్షలు
ఎంజీఎం దవాఖానలోని ఆర్‌బీఎస్‌కే భవన సముదాయం లో పిల్లలకు దంత వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఆధునిక యంత్రంతో పరీక్షలు చేసి అందుకు కావల్సిన పూర్తి చి కిత్సను అందిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉండి బాలల కు సేవలందించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం సుమారు 6 గంటల వరకు వైద్యులు విధుల్లో ఉంటారు.

పిల్లల తరలింపునకు మొబైల్ వాహనాలు
అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు సర్కార్ బడుల్లో చదువుకుం టూ ఆరోగ్య సమస్యలతో బాధపడే బాలలను గుర్తించి మొబైల్ వాహనాల ద్వారా ఆర్‌బీఎస్‌కే భవన సముదాయానికి తరలిస్తారని సిబ్బంది పేర్కొన్నారు. ముందుగా పేర్కొన్న ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా అట్టి వారికి ఆయా విభాగాలకు చెం దిన నిపుణుల ద్వారా చికిత్స అందిస్తారు. అయితే కేవలం ఓపీ సేవలకు మాత్రమే ఆర్‌బీఎస్‌కే పనిచేస్తుందన్నారు. ఇందులో మానసిక రుగ్మలతో బాధపడే చి న్నారులకు చికిత్సతోపాటు ఆటపాటలు కూడా నేర్పించేందు కు వారికి అవసరమైన ఆట వస్తువులు కూడా అందుబాటు లో ఉంచామని తెలిపారు. మొత్తంగా తెలంగాణ సర్కార్ బా లల ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పలువురు కొనియాడుతున్నారు.

మానసిక, ఫిజియోథెరపీకి చికిత్స
బాలలకు మానసిక, ఫిజియోథెరపీ చికిత్సలు కూడా ఇక్కడే అందించనున్నారు. మానసిక వ్యాధి లక్షణాలతోపాటు వైకల్యం తో బాధపడే చిన్నారులకు నిపుణులతో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మానసిక, ఫిజియోథెరఫీ విభాగాలను వేర్వేరుగా నెలకొల్పారు. ప్రత్యేక గదుల్లో ఆయా సదుపాయాలు క ల్పించారు. ప్రస్తుతం ఆయా విభాగాలతోపాటుగా రుగ్మతల ని వారణకు చికిత్సతో కూడిన కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు.

అందుబాటులో వైద్య నిపుణులు
ఆర్‌బీఎస్‌కేకు జిల్లా కోఆర్డినేటర్ శ్యామ నీరజ వ్యవహరిస్తుండగా వరంగల్ అర్బన్ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బీ హరీశ్‌రాజ్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఆర్‌బీఎస్‌కే భవన సముదాయంలో పిల్లల వైద్య నిపుణులు, మానసిక వైద్యులు, ఆడియాలజిస్టు, ఫిజియోథెరపిస్టు, స్టాఫ్ నర్సు, స్పీచ్ థెరపిస్టు, దంత వైద్య నిపుణులు, నేత్ర వైద్య నిపుణులుతోపాటు వివిధ శాఖలకు చెందిన వారు అందుబాటులో ఉంటారు. అంతేగాకుండా ఆర్‌బీఎస్‌కేలో పిల్లల వైద్యులు కూడా విధులు నిర్వహి స్తారు. ఇందుకోసం ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేశారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...