సంక్షేమ పథకాలు దేశానికే తలమానికం


Wed,July 17, 2019 04:11 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, జూలై 16 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరా జ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణంలో రూ.24.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి దయాకర్‌రావు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మంగళవారం శం కుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని వర్ధన్నపేట పట్టణం, తండాల్లో జరిగిన సభలలో మం త్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ 14 ఏళ్లపాటు అలుపెరగని పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాడన్నా రు. సాధించిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయ డం కోసం దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ప్రతీ పట్టణం, పల్లె లు, తండాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. అలాగే నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటికీ ప్రస్తుతం రూ.20కోట్ల మేర కు మంజూరు చేయించినట్లు తెలిపారు. త్వరలోనే మరో రూ.30 కోట్ల మేరుకు నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
మూడు నెలల్లో గోదావరి జలాలు..
రానున్న మూడు నెలల్లో వర్ధన్నపేట మండలానికి గోదావరి జలాలను రప్పించి చెరువులు, కుంటలు నింపేలా ప్ర ణాళికలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. సమావేశాలలో ఆయన మాట్లాడుతూ కే వలం మూడు సంవత్సరాలలోనే గోదావరి నదిపై కాళేశ్వ రం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయగలిగిందని అన్నారు. ఇప్పటికే ట్రయల్న్‌ల్రను పూర్తి చేసిన ప్రభు త్వం నీటి సరఫరా కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. గోదావరి నదిలోకి నీటి ప్రవాహం కూడా పెరుగుతున్నందున త్వరలోనే ప్రభుత్వం దేవాదుల ద్వారా నీటిని సరఫ రా చేయడంతో పాటుగా ఎస్సారెస్పీ 365 రోజులు పారుతుందన్నారు. దీనివల్ల వర్ధన్నపేట కింద ప్రాంత రైతులతో పాటుగా ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతానికి చెందిన గ్రామాలకు దేవాదుల ద్వారా సాగునీరు అందుతుందని చెప్పారు.

వ్యవసాయానికి ఈజీఎస్ అనుసంధానం..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్య వసాయానికి అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి దయాకర్‌రావు తెలిపారు. తండాల్లో జరిగిన సభలలో ఆయన మాట్లాడారు. ఈజీఎస్ పనుల మూలంగా రై తులకు కూలీలు దొరకక పోవడంతో రైతులు ఇబ్బందులు పడడంతో పాటుగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అందుకని ఈజీఎస్‌లో కూడా కూలీలతో కొన్ని అవసరమైన పనులు కూడా జరుగుతున్నందున ఈజీఎస్‌లో కొన్ని మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రధానంగా రైతులకు సంబంధించిన పంటల సాగు, కలుపు నివారణ, నాటు వేయడం, విత్తనాలు వేయడం వంటి పనులకు ఈజీఎస్ కూలీలను ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నా రు. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అలాగే మున్సిపాలిటీలలో కూడా ఈజీఎస్ పథకాన్ని రూర్బన్ పేరుతో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి వివరించారు.

ఇంటిస్థలం ఉన్నవారికి డబుల్‌బెడ్‌రూం ఇల్లు
పక్కా ఇల్లులేని పేదలకు ఇంటిస్థలం ఉన్నట్లయితే డబుల్‌బెడ్‌రూం ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ప్రభు త్వ స్థలంలోనే పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని ప్రభు త్వం ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వ స్థలాలులేకపోవడంతో ఇబ్బందిగా మారిందని చెప్పారు. ప్రస్తుతం పథకం లో సవరణలు చేసి ఇంటిస్థలం ఉండి ఇల్లులేని పేదలకు రూ.5.50లక్షలను ఇచ్చి డబుల్ బెడ్‌రూం నిర్మించుకునే అ వకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నదని చెప్పారు. మూడు నెలల్లోనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్ర భుత్వం సిద్ధ్దంగా ఉందని మంత్రి వివరించారు. కార్యక్రమాలలో కలెక్టర్ హరిత, ఆర్డీవో మహేందర్‌జీ, ఎంపీపీ అప్పారావు, జెడ్పీటీసీ భిక్షపతి, మార్నేని రవీందర్‌రావు, గుజ్జ సంపత్‌రెడ్డి, సారంగపాణి, చొప్పరి సోమయ్య, తుమ్మ ల యాకయ్య, తూళ్ల కుమారస్వామి, నూనె భిక్షపతి, ఎండీ రహీం, శ్యాంసుందర్‌రెడ్డి, వివిధ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...