పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు


Wed,July 17, 2019 04:08 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, జూలై 16 : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అధికారులు ఏమాత్రం అలసత్వం వహించినా చర్యలు తప్పవని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. వర్ధన్నపేట మండల పరిషత్ కా ర్యాలయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌లతో కలిసి మిషన్‌భగీరథ, ప్రజారోగ్యం, ఇంజినీరింగ్, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులతో తొలుతగా వర్ధన్నపేట మున్సిపాలిటీకి వచ్చిన నిధులు, టెండర్ల ప్రక్రియ తదితర విషయాలపై సమీక్షించారు. ప్రస్తుతం వర్ధన్నపేట పట్టణం, తండాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.20 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయినందున పనులను త్వరగా పూర్తి చేయాలని డీఈఈ శ్రీనాధ్‌రెడ్డికి సూచించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఏ ఒక్క గల్లీని వదలకుండా సీసీరోడ్లు, సైడ్ డ్రే యిన్‌లు నిర్మించాలన్నారు. వర్ధన్నపేట శ్మశానవాటికకు మరో రూ.3 కోట్ల మేరకు వెచ్చించి అన్ని వసతులు, శివాలయాన్ని నిర్మించేలా చర్యలు తీ సుకుంటానన్నారు. ఎమ్మెల్సీ కోటా నుంచి రెండు వైకుంఠ రథాలు ఇప్పించాలని కొరడంతో దీనికి ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి అంగీకారం తెలిపారు.
అలాగే మిషన్ భగీరథ ఈఈ రామాంజనేయులతో సమీక్ష నిర్వహి స్తూ తండాలకు తాగునీటి సరఫరా జరగకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తండాలకు మంగళవారం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెల్లిన సందర్భంలో పలువురు మహిళలు తాగునీటికి ఇబ్బందిగా ఉందని తెలిపారు. దీంతో ఆయన సమీక్షా సమావేశంలో గిరిజనుల చెప్పిన విషయాలను అధికారులకు తెలిపి త్వరలోనే తండాలోని ప్రతీ ఇంటికి తాగునీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంతేకాక వర్ధన్నపేటలో ఈనెల 20న మెగా జాబ్‌మేళాను నిర్వహించనున్నుట్ల మంత్రి చెప్పారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఈ మేళాకు సుమారు 80పేరున్న ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు వచ్చి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైనవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నటున్ల ఎర్రబెల్లి తెలిపారు. ఈ అవకాశాన్ని వర్ధన్నపేట నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరిత, ఆర్డీవో మహేందర్‌జీ, ఎంపీపీ అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎంపీడీవో కల్పన, వివిధ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...