మేడారం మహాజాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి


Tue,July 16, 2019 05:03 AM

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : మేడారం మహాజాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రా వు అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. 2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్ల ప్రతిపాదనల ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు సోమవారం సాయంత్రం హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిశారు. మేడారం జాతర ఏర్పాట్లను ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. మేడారం వన జాతరకు జాతీయస్థాయిలో ఎంతో ప్రాధాన్యత ఉందని, ఏర్పాట్లు అదే స్థా యిలో ఉండాలని అన్నారు. తాగునీరు, పారిశుధ్యం ఏర్పాట్లలో ఎక్కడా భక్తులకు ఇబ్బందులు రావొద్దని అన్నారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జాతరకు నెలరోజుల ముందే రుతుచక్రం పూర్తి సీసీ చేసేలా ప్రతిపాదనలు, ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మేడారం జాతర పూర్తిగా ఆదివాసీల సంప్రదాయాల ప్రకారం నిర్వహించాలని.. ఏర్పాట్లు, ప్రతిపాదనల తయారీ నుంచే ఆదివాసీలను, ఆలయ పూజారులు భాగస్వాములను చేయాలని సూచించారు. మేడారం గద్దెల వద్ద రద్దీని తట్టుకునేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. పోలీసు, ఆర్టీసీతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ జాతరను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...