బాలుడికి ప్రాణభిక్ష పెట్టండి


Mon,July 15, 2019 02:58 AM

కాజీపేట, జూలై 14: అర్బన్‌ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన ఓ బాలుడు తీవ్రమైన వ్యాధితో ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. మనస్సున్న మహారాజులు ముందుకు వచ్చి ఆర్థికసహాయం అందచేసి ప్రాణభిక్ష పెట్టాలని సామాజిక వేత్త చిలువేరు శంకర్‌ కోరారు. బాపూజీనగర్‌లోని షేక్‌ జావేద్‌ -జీనద్‌ సుల్తాన దంపతుల కుమారుడు షేక్‌ అయాన్‌(9) లివర్‌ ప్లాంటేషన్‌ భయాంకరమైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని మహ్మద్‌ సోని ద్వారా తెలుసుకుని ఆదివారం సాయంత్రం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షేక్‌ అయాన్‌ భయంకరమైన లివర్‌ ప్లాంటేషన్‌ వ్యాధితో ఉండడం బాధ అనిపించిందన్నారు. షేక్‌ అయాన్‌ తల్లిదండ్రులు షేక్‌ జావేద్‌, జీనద్‌ సుల్తానలు చెన్నైయిలోని దవాఖానలో చికిత్స నిమిత్తం పరీక్షలు చేయించామని తెలుపారన్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారన్నారు. అందులో అదే చెన్నైలోని రేలా దవాఖాన చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.20 లక్షలను ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. ఇంకా కావల్సిన రూ.5 లక్షల కోసం మనవతా వాదులు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. బాలుడి వైద్య చికిత్సల కోసం సహాయం చేయదలిచిన దాతలు షేక్‌ అయాన్‌ తండ్రి షేక్‌ జావేద్‌ పాషా బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ A/C NO 006901565086 , IFSC CODE ICIC0002303కు పంపగలరని తెలిపారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...