ముగిసిన గ్రామీణ క్రీడా పోటీలు


Mon,July 15, 2019 02:58 AM

వరంగల్‌స్పోర్ట్స్‌, జూలై14: రూరల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ క్రీడల సమాఖ్య వారు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడాపోటీలు ఆదివారంతో ముగిసాయి. ములుగురోడ్‌ రోడ్‌ సమీపంలోని ఎల్బీ కళాశాల క్రీ డామైదానం వేదికగా నిర్వహించిన ఈ పోటీల ముగింపు కా ర్యక్రమానికి జీహెచ్‌ఎంసీ ఎంహెచ్‌వో రాజారెడ్డి హాజరై క్రీ డాకారులకు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ క్రీడాకారులు తమ ప్రతిభతో ఉన్నత శి ఖరాలను అధిరోహించాలని అన్నారు. ఇలాంటి క్రీడాపోటీల నిర్వహణకు తన పూర్తి సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. పోటీల నిర్వహణ కార్యదర్శి సంతోష్‌ మాట్లాడుతూ జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభచూపిన వారు ఆ గస్టు 9 నుంచి 11 వరకు వరంగల్‌ జిల్లాలోనే నిర్వహిచను న్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఆర్‌జీఎఫ్‌ అధ్యక్షుడు కైలాస్‌యాదవ్‌, ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌-19 క్రీడాసమాఖ్య కార్యదర్శి సతీశ్‌, ఆర్‌జీఎఫ్‌ కార్యదర్శి నవీన్‌కుమార్‌, ఆంటోని, రహ్మత్‌, రాజు, రాజశేఖర్‌, అనిల్‌, సూరి, కిరణ్‌ పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...