సేవా కార్యక్రమాలతో గుర్తింపు


Mon,July 15, 2019 02:58 AM

న్యూశాయంపేట, జూలై 14: సేవా కార్యక్రమాల ద్వారానే వెలమ సంక్షేమ సంఘానికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని వెలమ సహకార సంఘం ట్రైసిటీస్‌ గౌరవ అధ్యక్షుడు తక్కళ్లపల్లి నారాయణరావు అన్నారు. ఆదివారం హం టర్‌రోడ్డు కాకతీయ గార్డెన్‌లో వెలమ సహకార సంఘం రెం డో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు పిన్నింటి వెంకటేశ్వరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం లో సంఘం సభ్యులు పాల్గొనాలని, ఉచితంగా ట్రీగార్డులు పంపిణీ చేయాలని సూచించారు. వెలమ కుటుంబ సభ్యులు ఐక్యం గా ఉండి, ప్రతి రెండు సంవత్సరా లకోసారి విజ్ఞాన విహారయాత్ర నిర్వహించాలన్నారు. సంఘం ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న సహకార సంఘంలో నూతన సభ్యులను చే ర్చుకోవాని కోరారు. 2017 జూన్‌ 2న సంఘం ఏర్పాటు చే సి రెండు సంవత్సరాలైన సందర్భంగా నూత న కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షుడు పిన్నింటి వెంకటేశ్వరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి ముందు సంఘం తరుపున మొక్క నాటే విధంగా తీ ర్మానించినట్లు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షల్లో, ఉద్యోగంలో పదోన్నతి పొందిన, రిటైర్ట్‌ ఉద్యోగుల ను, నూతన ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దశరథరావు, మట్టపల్లి సంపత్‌రావు, తిరుపతిరావు, రఘుపతిరావు, సోమేశ్వరావు, దయాకర్‌రావు, మర్నేని లక్ష్మారావు, రవీందర్‌రావు, ప్రశాశ్‌రావు, వెంకటేశ్వరావు, వెలమ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...