టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి


Mon,July 15, 2019 02:57 AM

సిద్ధార్థనగర్‌, జూలై 14: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. ఆదివారం వడ్డెపల్లి హనుమాన్‌ గుడి సమీపంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై జనం స్వచ్ఛందంగా తరలివచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 80శాతానికి పైగా సభ్యత్వాలు పూర్తయ్యాయని చెప్పారు. మేధావులు, విద్యావంతులు, యువకులు సభ్యత్వాలు తీసుకుంటున్నారని పే ర్కొన్నారు. టార్గెట్‌కు మించి సభ్యత్వాలను నమో దు చేయించి సీఎం కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అందించాలని అన్నారు. ప్రశాంత్‌నగర్‌ యువకులు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్‌, దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సుందర్‌రాజ్‌యాదవ్‌, కార్పొరేటర్‌ స్వప్న, డివిజన్‌ అధ్యక్షుడు ఎలుగంటి రాములు, పత్తి సంపత్‌రెడ్డి, కిషన్‌, మిడిదొడ్డి యాదయ్య, స్వామినాయక్‌, అశోక్‌కుమార్‌, శ్రావణ్‌, రాకేశ్‌, కుమార్‌, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...