సభ్యత్వాల నమోదుకు అపూర్వ స్పందన


Mon,July 15, 2019 02:57 AM

ఎల్కతుర్తి: టీఆర్‌ఎస్‌ సభ్యత్వాల నమోదుకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని పార్టీ సభ్యత్వ నమోదు హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య చెప్పారు. వరంగల్‌ అర్బన్‌ జెడ్పీ చైర్మన్‌ మారెపల్లి సుధీర్‌కుమార్‌తో కలిసి ఆదివారం సారయ్య ఎల్కతుర్తిలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు కావాలని అడుగుతున్నారంటే టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు మండలంలో రెండువేల క్రీయాశీలక, నాలుగు వేలు సాధారణ సభ్యత్వాలు నమోదైనట్లు వివరించారు. సమావేశంలో ఎంపీపీ మేకల స్వప్న, మండల అధ్యక్షుడు పోరెడ్డి రవీందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ తంగెడ నగేశ్‌, నాయకులు శ్రీపతి రవీందర్‌గౌడ్‌, తంగెడ మహేందర్‌, నిరంజన్‌రెడ్డి, శేషగిరి, వెంకటేష్‌యాదవ్‌, సాంబమూర్తి, సంపత్‌రావు, బాపురావు, సమ్మయ్య, జడ్సన్‌, సమ్మయ్య పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...