మరో ముందడుగు


Sun,July 14, 2019 02:13 AM

-కుడా మాస్టర్ ప్లాన్ అమల్లో పెరిగిన వేగం
-13 కి.మీ ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం
-భూసేకరణ కోసం రైతులు, యజమానులతో చర్చించిన కలెక్టర్
-నెగోషియేట్ రేటుకు భూములు అప్పగించేందుకు అంగీకారం
-10 రోజుల్లో అవార్డు ప్రకటించనున్న కలెక్టర్
-ఈ నెలాఖరుకు పూర్తి కానున్న భూసేకరణ ప్రక్రియ
అర్బన్ కలెక్టరేట్, జూలై 13: దినదినాభివృద్ధి చెందుతూ తెలంగాణలో రెండో అతిపెద్ద సిటీగా అవతరించిన వరంగల్ మహానగరంలో నానాటికి పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మాస్టర్‌ప్లాన్ రూపొందించింది. ఈ ప్లాన్‌లో మరో ముందడుగుపడింది. నగరానికి చేరుకునే రోడ్లను అనుసంధానం చేసేందుకు ఐఆర్‌ఆర్ (ఇన్నర్ రింగ్ రోడ్డు) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 83 ఎకరాల భూ సేకరణ కోసం ప్రభుత్వం రూ.105 కోట్లు విడుదల చేసింది. అందులో భాగంగా ఖమ్మం రోడ్డు నుంచి వయా నర్సంపేట రోడ్డు మీదుగా ములుగురోడ్డు వరకు 13 కి.మీల ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం జిల్లా యంత్రాంగం కసరత్తును వేగం చేసింది. ఈనేపథ్యంలో ఖిలా వరంగల్ మండలంలోని ఉర్సు, తిమ్మాపూర్, వరంగల్ మండలంలోని ఏనుమాముల రెవెన్యూ గ్రామాల పరిధిలో భూసేకరణకు కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ డ్రాప్టు పబ్లికేషన్‌ను ఇటీవల జారీ చేశారు. ఈ క్రమంలో భూములు కోల్పోయే రైతులు, యజమానులతో భూసేకరణ రేట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన ముఖాముఖిగా చర్చించారు.

ఆయా ప్రాంతాల్లో మూడేళ్ల నుంచి జరిగిన భూ క్రయ, విక్రయాల రేట్లను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తెప్పించి సగటు రేటుకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఏ మేరకు పెంచవచ్చనే అనే అంశంపై ఉన్న వెసలుబాటు ప్రకారం నెగోషియేట్ చేశారు. అలాగే కాజీపేట మం డలం శాయంపేట, ఖిలా వరంగల్ మండలం ఉర్సు మధ్య ఒకటి, కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద మరో రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మాణానికి సేకరించే భూములకు పేర్కొన్న నెగోషియబుల్ రేటుకు రైతులు అంగీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. చర్చల్లో వరంగల్ ఆర్డీవో వెంకారెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...