మండలంలో ఇద్దరు..


Sun,July 14, 2019 02:12 AM

కమలాపూర్: మండలంలోని శంభునిపల్లి గ్రామానికి చెందిన మోడెం సాయిప్రసన్న సివిల్ ఎస్సైగా అర్హత సాధించాడు. ప్రస్తుతం సాయిప్రసన్న భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది క్రితం జరిగిన వీఆర్వో రాత పరీక్షలో అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో 13 ర్యాంకు సాధించాడు. గ్రూప్-4లో రాష్ట్రస్థాయిలో 132 ర్యాంకు, జిల్లాలో 17వ ర్యాంకు సాధించాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై మక్కువతో ఇటీవల జరిగిన ఎస్సై రాత పరీక్ష రాసినట్లు చెప్పారు. ఫలితాల్లో మెరుగైన ర్యాంకు సాధించి ఎస్సై ఉద్యోగానికి అర్హత సాధించాడు. అలాగే కమలాపూర్‌కు చెందిన కంది ప్రశాంత్ భూపాలపల్లిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఎస్సైగా మౌనిక ఐనవోలు: మండలంలోని ఇద్దరు యువకులు ఎస్సైలుగా ఎంపికయ్యారు. ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన గోనె మల్లారెడ్డి కుమారుడు గోనె రఘుపతి, ఆరో డివిజన్ సింగారానికి చెందిన కట్కూరి రాములు కూతురు కట్కూరి మౌనిక ఎస్సైలుగా ఎంపికైయ్యారు. వీరిని ఎంపీపీ మార్నేని మధుమతి రవీందర్‌రావు, సర్పంచ్ ఆడెపు దయాకర్, ఎంపీటీసీ కడ్దూరి రాజు, కార్పొరేటర్ చింతల యాదగిరి, ఉమ్మడి జిల్లా యువజన నాయకుడు నాగేశ్వర్‌రావు, ఆలయ ధర్మకర్త సనోబోయిన సతీశ్‌కుమార్ అభినందించారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...