30 కిలోల గంజాయి పట్టివేత


Sun,July 14, 2019 02:09 AM

నిందితుడి అరెస్ట్, కారు సీజ్..
భీమారం, జూలై 13: గ్రేటర్ వరంగల్ పరిధిలోని పెద్దమ్మగడ్డ-కేయూసీ రోడ్ లోని యాదవ్‌నగర్ క్రాస్ రోడ్ వద్ద శనివారం అక్రమంగా తరలిస్తున్న 30కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఎండు గంజా యిని రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, కారును, గంజాయిని స్వా ధీనం చేసుకున్నారు. కేయూ ఎస్సై హరికృష్ణ కథనం ప్రకారం ములుగు జిల్లా, అన్నంపల్లి గ్రామానికి చెందిన తేజావత్ పరమ్‌సింగ్ కారులో ఒడిశా రాష్ట్రం నుంచి హన్మకొం డ మీదుగా మహారాష్ట్రలోని సోలాపూర్‌కు కారులో ఎండు గంజాయిని తరలిస్తున్నా డని విశ్వసనీయ సమాచారం అందింది. ఈమేరకు హన్మకొండలోని యాదవ్‌నగర్ క్రాస్ రోడ్డు వద్ద హసన్‌పర్తి తహసీల్దార్ రాజేశ్, కేయూ ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా నిందితుడు పట్టుబడ్డాడు. గంజాయి రవాణాకు వినియో గించిన టాటా విస్టా కారుతోపాటు 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరమ్‌సింగ్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు. తనిఖీల్లో కేయూ ఏఎస్సై భీమారెడ్డి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సోమలింగం, శ్రీనివాస్, అనిత, రెవెన్యూ సిబ్బం ది పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...