ఏనుమాములలో ఈ-నామ్ బృందం


Sun,July 14, 2019 02:08 AM

-అధికారులకు పలు సూచనలు
కాశీబుగ్గ, జూలై 13: వరంగల్ ఏనుమాముల వ్య వసాయ మార్కెట్‌ను శనివారం ఈ-నామ్ బృందం సందర్శించింది. ఈసందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ సహాయ కార్యదర్శి స్వైన్ ఆధ్వర్యంలో మార్కెట్‌లోని ఈ-నామ్ అమలు, ల్యాబ్‌లో గల అస్సెయింగ్ వివరాలను తెలుసుకున్నారు. మార్కెట్‌లో ఈ-నామ్ పనితీరుపై ఆరా తీశారు. అపరాలతోపా టు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్లో అమలయ్యేలా జా గ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారుల పనితీరు మరింత మెరుగుపడాలని కోరారు. వెంటనే మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయితో మాట్లాడి ఈ-నామ్ పూర్తిస్థాయిలో అమలయ్యేలా ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ మార్కెటిం గ్ డెవలపింగ్ ఆఫీసర్ చంద్రమౌళి, వరంగల్ రూ రల్ జిల్లా కలెక్టర్ ఎం హరిత, డీడీఎం అజ్మీరా రాజునాయక్, రూరల్ జిల్లా డీఎంవో కందగట్ల రామకృష్ణ, కార్యదర్శి క్యారం సంగయ్య, సూపర్‌వైజర్లు జన్ను భాస్కర్, కిష్ణయ్య, కనుకుంట్ల వినయ్‌కాంత్, ము డిదె శివకుమార్, శ్రీకాంత్, సాగర్, వివేక్, చారి, రవి, శ్రీను, క్రాంతి, మధు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...